iDreamPost
iDreamPost
ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల కోసం ఎదురు చూసినట్టే ప్రత్యేకంగా ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని యాప్స్ ఉండటంతో ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వాళ్ళు తమ బడ్జెట్ లకు అనుగుణంగా ప్లాన్లు తీసుకుని మూవీస్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం మాత్రం కొంత డల్ గా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారని ఈ 30న జీ5లో విడుదల చేస్తారనే న్యూస్ వచ్చింది కానీ ఇప్పటిదాకా సదరు సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. బహుశా రేపో ఎల్లుండో అనౌన్స్ మెంట్ ఇస్తే మిస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఇదే బెస్ట్ ఆప్షన్ గా ఎంజయ్ చేయొచ్చు.
విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా ఎల్లుండి 28 నుంచి సోనీ లివ్ లో ఉంటుంది. తెలుగుతో సహా మల్టీ లాంగ్వేజెస్ ఇవ్వబోతున్నారు. డిజాస్టర్ అయినప్పటికీ చియాన్ వేసిన విభిన్న వేషాలు, హెవీ బడ్జెట్ తో నిర్మించిన విజువల్స్ కోసం ఓ లుక్ వేసే వాళ్ళు చాలానే ఉంటారు. 30న జీ5లో ఆర్య హీరోగా చేసిన కెప్టెన్ స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ చిత్రం ప్రిడేటర్ స్పూర్తితో నిర్మించిన ఈ హై టెక్నికల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. టేకింగ్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి కానీ టైంపాస్ కి ఓ లుక్ వేయొచ్చేమో. బ్రాడ్ పిట్ నటించిన బుల్లెట్ ట్రైన్ ని తెలుగుతో పాటు ఒరిజినల్ వెర్షన్ లో ఇదే జీ5 నుంచి రిలీజ్ కానుంది. దీనికీ వ్యూస్ భారీగా వస్తాయి.
ఇవి మినహాయించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేవు. కార్తికేయ 2 అక్టోబర్ 5న దసరా పండగ సందర్భంగా జీ ఫైవ్ లోనే వదులుతారు. గత వారం వచ్చిన డిజాస్టర్ టైటిల్స్ కళాపురం, ఫస్ట్ డే ఫస్ట్ షోలు ఆడియన్స్ ని డిజిటల్ స్పేస్ లోనూ మెప్పించలేకపోయాయి. హాట్ స్టార్ లో వచ్చాక లైగర్ మీద సోషల్ మీడియా ట్రోలింగ్ మళ్ళీ మొదలయ్యింది. బ్లాక్ బస్టర్ ఏదీ ఈ మధ్య రాకపోవడంతో కొంత డల్ గా ఉన్న ఓటిటికి మళ్ళీ ఊపొచ్చేది వచ్చే నెల నుంచే. ఆ మధ్య నిర్మాతల మండలి థియేటర్ కు డిజిటల్ కు ఎనిమిది వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలనే నేపథ్యంలో రాబోయే రోజుల్లో చాలా వెయిట్ చేస్తే కానీ కొత్త సినిమాలు వచ్చేలా లేవు. నిజంగా అమలవుతుందానే దాని మీద అనుమానాలు లేకపోలేదు