Uppula Naresh
Uppula Naresh
విప్లవ గాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) కడసారి చూపు కోసం ఆయన అభిమానులు రాష్ట్ర నలువైపుల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఇదే కాకుండా ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతమయాత్ర సాయంత్రానికల్లా ఆయన ఇంటికి చేరింది. ఈ యాత్రలో ఎందరో కళాకారులతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన పార్థివదేహాం ముందు పుష్ప గుచ్చం ఉంచి ఘన నివాళులర్పించారు.
ఆ తర్వాత గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భోరాసానిచ్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హారీష్ రావు, హోంమంత్రి మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు కూడా చేశారు. ఇక విప్లవ గాయకుడిని చివరికి సారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇది కూడా చదవండి: గద్దర్ మృతిపై లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ