సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

అర్హతే ఆధారంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ రోజు స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. ఈ మేరకు కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. పథకాలు ప్రజలకు అందిచడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. అర్హత ఉండి పథకం రాలేదనే మాట ప్రజల నుంచి వినిపించకుండా ఉండేలా అమలు చేయాలని పేర్కొన్నారు.

నిర్ణీత గడువులో పథకాలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్‌కార్డు, పింఛన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అవినీతి, కాలయాపనకు, వివక్షకు ఏ మాత్రం అవకాశం లేకుండా గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు ఇస్తున్నామని, అక్కచెళ్లమ్మల పేరుపై ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి 90 రోజుల్లో ఇస్తామని చెప్పారు. శ్యాచురేషన్‌ విధానంలో పథకాలు అందించాలని కలెక్టర్లకు సీఎం జగన్‌ సూచించారు.

Show comments