సంక్షోభంలోను సంక్షేమం వదలని సియం జగన్

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్నీ స్థంభింపచేసిన వేళ, ప్రపంచం లోని అన్ని దేశాలు కరోనా దెబ్బకి విలవిలలాడిపోతున్నాయి. ఒక పక్క ప్రాణ నష్టంతో మరో పక్క అర్ధిక ఇబ్బందులతో దేశాలకు దేశాలే కుదేలవుతున్న పరిస్థితి ఏర్పడింది. 1929 లో న్యూయార్క్‌లో స్టాక్ మార్కెట్ పతనం 1930 లలో యూరప్‌లో ఫాసిస్టుల పెరుగుదలకు దోహదం చేసినట్టు ఈ కరోనా వైరస్ విపత్తు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఎటువైపు నడిపించబోతోందో తల పండిన ఆర్ధిక వేత్తలు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మాత్రం తీవ్ర సంక్షోభంలో కూడా ఉన్నా ఆ సంక్షోభం తాలూకూ దుష్ప్రభావాలు రాష్ట్ర ప్రజల పై పడకుండా చూస్తూ వారికి అందవలసిన సంక్షేమాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నారు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయటంలో ప్రణాళికా బద్దంగా వ్యూహాలు అమలు చేసి జగన్ సత్ఫలితాలు పొందారనే చెప్పాలి. విదేశాలనుండి వచ్చిన వారిని కనుగొనడంలో వాలంటీర్ల చేత సర్వే నిర్వహించడం, దేశంలొనే ఎవరు చేయని విదంగా పెద్ద ఎత్తున కొరియా నుండి నాణ్యమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించడం , కరోనా వ్యాదిని గుర్తించే టెస్టులు దేశ సగటు కన్నా ఎక్కువ శాతం చేయడం ద్వారా వ్యాధి విస్తరణను కట్టడి చేసే ప్రయత్నంలో ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండడం , రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తుండడం , ఒక్కో వైరాలజీ ల్యాబ్ కు 2 కోట్లు వెచ్చించి 9 వైరాలజీ ల్యాబ్ లని ఏర్పాటు చేయడం. ఆసుపత్రులని మెరుగు పరచడం, రాష్ట్రాన్ని జోనులగా విభజించి రెడ్ జోన్లని ప్రత్యకంగా పర్యవేక్షించడం. ప్రజలకు అందుబాటులోకి వై.యస్.ఆర్ టెలి మెడిసిన్ సేవలు తీసుకుని రావడం లాంటి అనేక చర్యలతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నంలో సఫలీకృతం దిశగా అడుగులు వేస్తోంది .

ఒక పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ ని కట్టడి చేస్తూనే మరోపక్క రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడలోను సఫలీకృతం అయ్యారు జగన్, రాష్ట్ర విభజన తరువాత ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థని చంద్రబాబు 5ఏళ్ళు పాలనలో మరింత అస్తవ్యస్తం చేశారు . ఆదాయ వ్యయం మద్య సమతుల్యత పాటించకుండా అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లారు. ఇటువంటి స్థితిలో పగ్గాలు చేపట్టిన జగన్ ఏ ఒక్కరోజు ప్రజలకు అందవల్సిన సంక్షేమం విషయంలో సాకులు చెప్పకుండా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న నెలల్లోనే తాను హామీ ఇచ్చిన పధకాలులో 90 శాతం అమలు చేసి లబ్దిదారులకు ఆర్ధికంగా అండగా నిలబడ్డారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి ప్రజలకు అందవలసిన సంక్షేమం రెండిటిని బ్యాలెన్స్ చేస్తు కాకలు తీరిన పరిపాలనా దక్షకులు సైతం నివ్వెర పోయేలా అడుగులు వేస్తున్నారు.

ఇక కరోనా వైరస్ దేశాన్ని కమ్మేసి అన్ని రంగాలు ఆర్ధికంగా కుదేలయి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్న వేల దేశంలోని ధనిక రాష్ట్రాలుగా పేరున్న అనేక రాష్ట్రాలు ప్రజలకు అందించవసిన అనేక వాటిపై కోతలు పెడుతూ వస్తున్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా వైరస్ ప్రభావాన్ని తన పాలనా దక్షతతో నియంత్రిస్తూనే మరోపక్క రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పధకాలు అందిoచడంలో కూడా వెనకడుగు వేయడంలేదు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంటు డబ్బులను జగనన్న విద్యా దీవెన కింద 4వేల కోట్లు విడుదల చేశారు. వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పదకం కింద పొదుపు సంఘాలకు 1400 కోట్లు విడుదల చేశారు, కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకునే వారికి ఆర్ధిక సాయం కింద 2వేలు ఇస్తున్నారు, వీటితో పాటు వ్యవసాయ రంగాన్ని , ఆక్వా రంగాన్ని, ఆదుకున్నారు, వీరికి రవాణతో పాటు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. రాజధాని పరిధిలో భూమిలేని నిరుపేదలకు రావల్సిన పెన్షన్ మొదటి మూడు నెలలకు కాను 16.25 కోట్లు మంజూరు చేశారు. ప్రతి నెల ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్లు గ్రామ వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే అందిస్తున్నారు, ధనిక రాష్ట్రాలు గా చెప్పుకునే వారే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల్లో నిర్దిష్ట గడువు లేకుండా కోత పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆర్ధిక వెసులుబాటు చేసుకొంటూ విడతల వారీగా వారికి పూర్తి జీతం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మత సంస్థలతో అనుభందం ఉండి లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అర్చకులకు , పాస్టర్లకు, ఇమాంలకు ఎక్కడ లేని విధంగా మనిషికి 5వేలు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం మొదలు పెట్టారు .

ఇలా చెప్పుకుంటు పోతే అడుగడుగునా ఒక సంక్షేమ పదకం. ఒక పక్క రాష్ట్రంలో ఏ ఒక్కరికి కరోనా వలన ఇబ్బంది లేకుండా చూస్తునే మరో పక్క ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో మనోదైర్యం నింపుతున్నారు, అలాగే తాను చేయాలనుకున్న సంక్షేమానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకుండా దూకుడుగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలనలో పోటీ పడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆర్ధిక పరిస్థితులు తన సంక్షేమ పథకాల లక్ష్యానికి ఏమాత్రం అడ్డుకావు అని ప్రజల పట్ల తనకి ఉన్న నిబద్దతను, చిత్తశుద్దిని నిరూపించుకొంటున్నారు సి.యం జగన్.

Show comments