iDreamPost
android-app
ios-app

ఇసుకపై జగన్ “స్పెషల్” ట్రీట్మెంట్..!

ఇసుకపై జగన్ “స్పెషల్” ట్రీట్మెంట్..!

అక్రమార్కులకు షాక్!

ఇసుక పేరుతో రాజకీయ దుమారం రేపుతున్న ప్రతి పక్షాలకు, అక్రమ వ్యాపారులకు చెక్ పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. ఇప్పటికే స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు సత్ఫలితాలను ఇస్తుంది. ఆ టీమ్ ఎక్కడికక్కడ ఇసుక అక్రమ రవాణాను అడ్డు కుంటొం ది. జగన్ ఆదేశాల మేరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. అయితే… ఇసుక అందరికీ అందుబాటులో ఉండడం లేదని, బడా వ్యాపారులే తీసుకుపోతున్నారు అని, సరఫరాలో పారదర్శకత లోపించందనే అంశాలు జగన్ దృష్టికి వెళ్ళాయి. ఆ విషయాలు తెలిసిందే తడవుగా జగన్ వెంటనే సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. ఇసుక విధానంలోని లోపాలపై సీరియస్ అయ్యారు.

బల్క్ బుకింగ్స్ ని పోర్టల్ నుంచి తీసేయాలని ఆదేశించారు. బల్క్ ఆర్డర్ కావాలంటే జాయింట్ కలెక్టర్ అనుమతి ఉండాల్సిందే అని తెలిపారు. ప్రభుత్వ పనుల కోసమంటూ ఇసుక తరలించడానికి కూడా ఎస్ ఈ లేదా జేసీ అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పాటు ఇసుక బుకింగ్స్ కోసం సాయంత్రం 6గం.ల వరకూ అనుమతించాలని చెప్పేశారు. గ్రామ సచివాలయం నుంచే ఇక ఇసుక బుకింగ్స్ ను తక్షణం అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

ఇసుక సమస్యపై జగన్ నేరుగా రంగంలోకి దిగి ఆదేశాలు ఇవ్వడం అధికారులను విస్మయానికి గురి చేసింది. అక్రమార్కులకు చెమటలు పట్టించింది. ప్రతిపక్షాలను కిక్కురు మనకుండా చేసింది. ఈ విధానాలు చాలా మందికి కంట్లో ఇసుకగా మారాయి. ఇసుకపై రాజకీయ అగ్గి రాజకీయ అగ్గి రాజేయాలని టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను జగన్ సున్నితంగా ఆర్పేసారు. ఎస్ ఈ బీ తో అక్రమ మద్యం, ఇసుక, మట్టి తవ్వకాలు అన్నింటినీ నిలువరించే శారు.

ప్రతి పక్షాలు రాద్దాంతం చేస్తునట్లుగా వాస్తవానికి కొరత లేదు. సరిపడా నిల్వ ఉంది. కావాలంటే తూగో జిల్లా జగ్గంపేట, పగో జిల్లా తాడేపల్లిగూడెం వద్ద కొత్తగా వెలిసిన ఇసుక కొండలు చూస్తే అర్థమవుతుంది. అయితే.. తవ్వకాలు జరిపి అందుబాటులోకి తేవడం లోనే లోపం జరుగుతోంది. దీన్ని గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో వారు కదిలారు. ఇప్పటి వరకు రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక నుంచి దాని ని 3 లక్షల టన్నుల కు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. స్టాక్ పాయింట్లలో కావల్సినన్ని నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ ను సరిదిద్దే క్రమంలో సీఎం జగన్ కొత్తగా బల్క్ ఆర్డర్లకు జేసీ అనుమతి తీసుకోవాలని మెలికపెట్టడం చాలామందికి మింగుడుపడడం లేదు.

ప్రజల్లో పట్టు కోల్పోయిన ఏపీ ప్రతిపక్షం ఇసుక పై రాజకీయ ఆజ్యం పోసి.. ఏదో చేదామనుకుంటే… జగన్ నిర్ణయాలతో పార్టీయే మునిగి పోయేలా ఉందనే భయం పట్టుకుంది.