iDreamPost
iDreamPost
వీరసింహారెడ్డి విడుదల తేదీ జనవరి 12 అధికారికంగా ప్రకటించాక మెగా ఫ్యాన్స్ తమ వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. బాలయ్య కన్నా ఒక రోజు ఆలస్యంగా జనవరి 13న చిరంజీవి థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు. ముందు 11 అనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలతో పాటు జికె మోహన్. ఇతరత్రా మెగా ఫ్యామిలీ శ్రేయోభిలాషుల సూచన మేరకు శుక్రవారం వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఫ్యాన్స్ మాత్రం అంత సంతృప్తిగా కనిపించడం లేదని సోషల్ మీడియా పోస్టులు ట్వీట్లు చూస్తే అర్థమవుతోంది. అన్ని చోట్లా తగినన్ని థియేటర్లు దక్కవేమోననే ఆందోళనే దీనికి కారణంగా కనిపిస్తోంది.
నిజానికి ఇక్కడ ఖంగారు పడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే లేట్ గా రావడం వల్ల నష్టాలు ఉన్నట్టే లాభాలు కూడా ఉన్నాయి. ముందుగా వచ్చే వాటి టాక్ పూర్తిగా తెలిసిపోతుంది. వాటిలో ఏదైనా ఫ్లాప్ లేదా యావరేజ్ అనిపించుకున్నా ఆటోమేటిక్ గా థియేటర్లు కొన్ని అదనంగా వీరయ్యకు వచ్చి చేరతాయి. వీరసింహారెడ్డి మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తుంది. వారసుడు, తెగింపులో ఏదైనా వీక్ గా ఉంటే చాలు ఆ అడ్వాంటేజ్ ని చిరు బాలయ్యలు వాడుకోవచ్చు. కాకపోతే థియేటర్ అగ్రిమెంట్లు గట్రా మార్చుకోవడం సులభం ఉండదు కానీ పండగ సీజన్ లో వచ్చే డిమాండ్ కు తగ్గట్టు అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే
వాల్తేర్ వీరయ్యకు ఇంకా ఒక పాట బాలన్స్ ఉంది. చిరంజీవి శృతి హాసన్ ల మధ్య వచ్చే వారం నుంచి రష్యాలో షూట్ చేయబోతున్నట్టు టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి. రవితేజ టీజర్ తాలూకు ప్రకటన రాలేదు. తర్వాత అన్నదమ్ముల కాంబో సాంగ్ ఒకటుంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాలి. మైత్రి సంస్థ వీరయ్యను చూసుకుంటూనే ఇవే పనులను వీరసింహారెడ్డికు బాలన్స్ చేయాలి. 2013లో జరిగిన సంక్రాంతి క్లాష్ లో ఖైదీ నెంబర్ 150 ముందు వస్తే గౌతమి పుత్ర శాతకర్ణి నెక్స్ట్ డే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు దానికి రివర్స్. రెండూ మాస్ బొమ్మలే కావడంతో అంచనాలు మాములుగా లేవు. అసలైన హైప్ ఇంకా మొదలుకానే లేదు