iDreamPost
android-app
ios-app

30 ఏళ్ళ తర్వాత రానున్న కాంబో ?

  • Published Feb 04, 2020 | 4:21 AM Updated Updated Feb 04, 2020 | 4:21 AM
  • Published Feb 04, 2020 | 4:21 AMUpdated Feb 04, 2020 | 4:21 AM
30 ఏళ్ళ తర్వాత  రానున్న కాంబో ?

మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న విచిత్రమైన స్నేహ బంధం గురించి ఇండస్ట్రీకే కాదు సినిమా ప్రియులకు కూడా బాగా తెలుసు. ఓ మాట అనేసుకోవడం ఆ తర్వాత స్టేజిల మీద ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించేసుకోవడం చాలా సార్లు చూసిందే. అప్పుడెప్పుడో వజ్రోత్సవాల వేడుకల్లో జరిగిన చిన్న అపశ్రుతి తర్వాత ఇద్దరికి చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడు అది లేదన్నది కూడా వాస్తవం.

మోహన్ బాబు సోలో హీరోగా మారక ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా బిల్లా రంగాలో నువ్వా నేనా అంటూ పోటీ పడి నటించడం అప్పటి అభిమానులకు గుర్తే. తర్వాత చిరంజీవి మెగాస్టార్ అయిపోగా మోహన్ బాబు కొన్నేళ్లు విలన్ గానే కొనసాగుతూ వచ్చారు. 1990లో వచ్చిన కొదమసింహం ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి చిత్రం. అందులో సుడిగాలిగా మోహన్ బాబు చేసిన డిఫరెంట్ విలనీ దానికి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. దాని తర్వాత మోహన్ బాబు ఇంకే సినిమాలోనూ విలన్ గా నటించలేదు. హీరో అటుపై స్టార్ గా మారిపోయారు.

ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరి వెండితెర కలయిక జరగబోతోందని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 152వ సినిమాలో మోహన్ బాబుకి ఒక కీలక పాత్ర ఆఫర్ చేశారని త్వరలోనే ఆయన వద్దకు వెళ్లి చర్చించే అవకాశాలు ఉన్నాయని దాని సారాంశం. ఒకవేళ ఇదే నిజమైతే కనక ఫ్యాన్స్ కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. మోహన్ బాబు సినిమాలు తగ్గించారు కానీ నటన మానేయలేదు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వమ్ లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఒకవేళ చిరు మూవీ కూడా కన్ఫర్మ్ అయితే ముప్పై ఏళ్ళ తర్వాత ఇద్దరు స్నేహితులను సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş