iDreamPost
iDreamPost
మారుతున్న పరిస్థితులను బట్టి, ఉద్యోగుల శ్రేయస్సు కోసమని, ఇప్పుడున్న 29 చట్టాలను కలగలిపి , మెరుగుపరచడానికి, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను, ఈరోజు నుంచి అమలు చేస్తోంది. జూలై 1 నుండి మీరు తీసుకొనే జీతం, ఫైనల్ సెటిల్మెంట్, పనివేళలుకూడా మారనున్నాయి.
జూలై 1 నుండి అమలులోకి వచ్చే మార్పులు ఏమిటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
ఎవరికీ కొత్త నిబంధనలు?
కొత్త కోడ్‌ల కేంద్రం బుక్‌లెట్ ప్రకారం, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఈ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పటిదాకా అసంఘటిత రంగానికి పీఎఫ్ లేదు. వాళ్లకు ప్రత్యేక ఖాతా సంఖ్య (UAN) ఇచ్చి, చట్టపరిధిలోకి తీసుకొనిరానున్నారు. అంటే దేశంలో ఎవరు, ఎక్కడ పనిచేసినా వాళ్లందరూ లేబర్ కోడ్ పరిధిలోకి వస్తారు.
“ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లతోపాటు ఉద్యోగుల బీమా కింద అన్ని రకాల వైద్య ప్రయోజనాల కవరేజీ కార్మికులందరికీ అందుబాటులో ఉంటుంది.”
మీ వర్కింగ్ అవర్స్ మారతాయా?
ఇప్పుడున్న పనివేళలు అలాగే ఉంటాయి. కాని, ఒక రోజులో 12 గంటలకు మంచి పనిచేయకూడదు. అలాగే వారానికి మొత్తం పనిదినాలు 48 గంటలకు మించకూడదు. ఇప్పుడున్నరోజువారీ పరిమితి 9 గంటలు. దీనర్ధం ఏంటి? ఒక కంపెనీ తన అవసరార్ధం ఉద్యోగులను నాలుగు, ఐదు లేదా ఆరు రోజులు పని చేయమని అడగలదు. దాన్ని బట్టి వారంలో గంటలను లెక్కించొచ్చు. అంటే రోజుకి 12-గంటల పనిచేస్తే, మీరు వారానికి నాలుగు రోజులు వర్క్ చేస్తే చాలు. 48 గంటల పరిమితిని మీరు రీచ్ అవుతున్నారుకదా. అప్పుడు వీక్లీకి మూడు ఆఫ్ డేలుంటాయి. వారానికి ఎన్నిరోజులు ఆఫ్ ఇవ్వాలో, ఎన్ని గంటలు పనిచేయించాలో కంపెనీ స్వంత నిర్ణయం. అదేమీ మీ జీతంపై ప్రభావాన్ని చూపించదు. వారానికి మీరు చేయాల్సిన పని 48గంటలు మాత్రమే.
కొత్త నియమాలతో సెలవులు పెరుగుతాయా? తగ్గుతాయా?
కొత్తగా చేరేవారి సెలవుల అర్హతను 240 రోజుల నుండి 180 రోజులకు కొత్త కోడ్‌లు తగ్గించాయి. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇప్పటిదాకా, ఏడాదిలో కనీసం 240 రోజులు పనిచేసిన కార్మికులందరికీ 12రోజుల వార్షిక/ఎర్నడ్ లీవ్ ఇస్తారు. ఇప్పుడు 180కి పనిచేస్తేచాలు, వాళ్లందరికీ 12 సెలవులు వస్తాయి.
ఇంకో గుడ్ న్యూస్. ఉపయోగించని సెలవులను ఏటా ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. అదే ఇంతకుముందు ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకోగలిగేవాళ్లు.
ప్రభుత్వ ఉద్యోగికి యేడాదికి ముప్పై సెలవులున్నాయి. అదే మిలిటరీలో అరవై సెలవులు.
జీతాల సంగతేంటి?
కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగుల బేసిక్ శాలరీ, వాళ్ల జీతంలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల, ప్రావిడెంట్ ఫండ్ కి ఉద్యోగులు, యజమానులు కట్టాల్సిన నెలవారీ మొత్తం పెరుగుతుంది. టేక్-హోమ్ జీతం తగ్గుతుంది. ఇదికూడా తక్కువ మొత్తమే. మరి దీనివల్ల లాభమేంటి? రిటైర్మెంట్ తర్వాత చెల్లించే గ్రాట్యుటీ, కార్పస్ పెరుగుతుంది.
ఫైనల్ సెటిల్మెంట్ సంగతేంటి?
వేతనాలపై కోడ్ ప్రకారం, మీరు రాజీనామా చేసినా, సంస్థ మిమ్మల్ని వద్దనుకున్నా, రిజైన్ చేసిన రెండు రోజుల్లోగా, మీకు రావాల్సిన బకాయిలకు సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది.
మహిళలకు ప్రత్యేక నిబంధనలున్నాయా?
OSHC, 2020 కోడ్, మహిళా ఉద్యోగులు, వాళ్ల ఇష్టంతోనూ, భద్రతకు లోబడి నైట్ డ్యూటీలు చేయొచ్చు.
వాళ్లకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు, పని అవకాశాలు కల్పించడం యజమాని బాధ్యత.