Swetha
అసలు జక్కన్నతో సినిమా అని అనౌన్సుమెంట్ దగ్గర నుంచే మూవీ మీద హైప్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. అందులోను మహేష్ సినిమా. సాఫ్ట్ గా కనిపించే మహేష్ ను జక్కన్న ఏ విదంగా చూపిస్తాడా అనే ఎగ్జైట్మెంట్ ఓ వైపు

అసలు జక్కన్నతో సినిమా అని అనౌన్సుమెంట్ దగ్గర నుంచే మూవీ మీద హైప్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. అందులోను మహేష్ సినిమా. సాఫ్ట్ గా కనిపించే మహేష్ ను జక్కన్న ఏ విదంగా చూపిస్తాడా అనే ఎగ్జైట్మెంట్ ఓ వైపు . సరే ఆగస్టు 9 మహేష్ బర్త్ డే కదా.. ఆనవాయితీ ప్రకారం జక్కన్న తన సినిమా నుంచి అప్డేట్ ఇస్తాడు అనుకుంటే.. మరోసారి అందరికంటే తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
సింపుల్ గా ఓ ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు. అది కూడా ఫేస్ దాచేసి.. నవంబర్ లో ఫస్ట్ రివీల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. కానీ ఈ ప్రీ లుక్ పోస్టర్ తో కూడా మహేష్ అభిమానులు ఖుషి అయిపోతున్నారు. దొరికిందే మహా ప్రసాదం అనేలా దానిని చూసి మురిసిపోతున్నారు. పోస్టర్ ను గమనిస్తే మహేష్ ఓ లాకెట్ ధరించి ఉన్నాడు. ఇక అదేంటో దాని వెనుక కథేంటో తెలియడానికి చాలా సమయం పడుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.