Swetha
ఆడియన్స్ లో కూలి ఎఫెక్ట్ ఓ రేజ్ లో ఉంది. ఉపేంద్ర , నాగార్జున , రజినీకాంత్ కలిసి స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత కాస్త మిక్సెడ్ టాక్ వచ్చిన మాట నిజమే కానీ.. ఆ ఎఫెక్ట్ సినిమా హైప్ మీద మాత్రం పడలేదు
ఆడియన్స్ లో కూలి ఎఫెక్ట్ ఓ రేజ్ లో ఉంది. ఉపేంద్ర , నాగార్జున , రజినీకాంత్ కలిసి స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత కాస్త మిక్సెడ్ టాక్ వచ్చిన మాట నిజమే కానీ.. ఆ ఎఫెక్ట్ సినిమా హైప్ మీద మాత్రం పడలేదు
Swetha
ఆడియన్స్ లో కూలి ఎఫెక్ట్ ఓ రేజ్ లో ఉంది. ఉపేంద్ర , నాగార్జున , రజినీకాంత్ కలిసి స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత కాస్త మిక్సెడ్ టాక్ వచ్చిన మాట నిజమే కానీ.. ఆ ఎఫెక్ట్ సినిమా హైప్ మీద మాత్రం పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో రోజు రోజుకి ట్రేడ్ మార్కెట్ ఆశ్చర్యపడేలా చేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఇంకా అమ్మకాలు మొదలుపెట్టకముందే.. కేవలం ఒక కేరళ , తమిళనాడు నుంచే సుమారు నలభై కోట్ల వసూళ్లు వచ్చాయట. ఇక తెలుగు స్టేట్స్ లో బుకింగ్ ఏ రేంజ్ లో వస్తాయో ఊహించడం కష్టమే.
వార్ 2 కంటే ముందుగా కూలీ బుకింగ్ స్టార్ట్ చేయడం బాగానే కలిసి వస్తున్నట్లు ఉంది. అటు ఓవర్శిస్ లో కు కూలీ విధ్వంసం సృష్టిస్తుంది. మొదటి షో పడే టైం కు ఈ నెంబర్ ఎక్కడవరకు చేరుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పైగా విదేశాల్లో ప్రభుత్వ పోలీసులు సైతం ప్రమోషన్ క్యాంపైన్ లో పాలు పంచుకుంటున్నారు. రజిని కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో కూలీతో అందరికి అర్థమైపోతుంది.
ఓ కమర్షియల్ సినిమాకు ఈ రేంజ్ లో హడావిడి చేయడం బహుశా ఇదే మొదటిసారేమో. ఇక్కడ రజిని ఇమేజ్ తో పాటు లోకేష్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఓ రీజన్. మొదటి షో కనుక పాజిటివ్ టాక్ వస్తే ఇక రెండు మూడు వారాలు థియేటర్ ఓనర్స్ కు పండగే.. మరోసారి థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం ఖాయం. అటు వార్ 2 టాక్ కూడా కూలీ వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఏదేమైనా ఈ ఏజ్ లో కూడా రజిని సృష్టిస్తున్న సునామి చూస్తుంటే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.