Idream media
Idream media
మనకి టైం బాగలేనప్పుడు , వాచీని కొత్తది కొనడం వల్ల ప్రయోజనం లేదు. కాలం కలిసి రానప్పుడు మెడలో ఉన్న కండువా కూడా పాముగా మారి కరుస్తుంది.
కాలం గొప్పదనం ఏమంటే అది ప్రతి ఒక్కరికీ తన ఆటను చూపిస్తుంది. కాల సర్పం అంటే ఇదే, దాని కాటు నుంచి తప్పించుకోవడం కష్టం. జరిగినంత కాలం మనంతటి వాళ్లు లేరనుకుంటే మనల్ని మించిన వాళ్లు పుడతారు. చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే.
మనం ఇతరులకు ఏమి ఇస్తామో , అదే తిరిగి లభిస్తుంది. ఉప ముఖ్యమంత్రి కావాలనుకున్న దగ్గుబాటికి పరాభవం, తండ్రిని అవమానించిన హరికృష్ణకి భంగపాటు , మామ ఎన్టీఆర్‌కి కుంగుబాటుతో కూడిన మరణం, ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకున్న పాపానికి లక్ష్మిపార్వతికి అంతులేని అవమానాలు. యూత్ జేజేలు కొట్టే జూనియర్ ఎన్టీఆర్‌కి కరివేపాకు ట్రీట్‌మెంట్.
Read Also: వైఎస్ మంచోడు.. నాకు గౌరవం ఇచ్చేవాడు..
ఇప్పుడు చంద్రబాబు టైం స్టార్ట్ అయ్యింది. ఎన్నికల్లో ఓడిపోవడం బాబుకి కొత్త కాకపోవచ్చు. జగన్ లాంటి నాయకులు ఎదురు కావడం కొత్త. ఆయనకి మొదటి ఎదురు దెబ్బ ఏమంటే, జగన్ సంక్షేమ పథకాలతో జనంలోకి చొచ్చుకుపోవడం. తప్పులు వెతికే వారికి కనిపించకపోవచ్చు కానీ, వారం రోజులుగా ఇష్టంగా మంచి భోజనం తింటూ కళకళలాడుతున్న చిన్న పిల్లల్ని అడిగితే చెబుతారు జగన్ గురించి. పండగకి ముందే అమ్మ ఒడి తెచ్చుకున్న తల్లుల్ని అడిగినా చెబుతారు.
జగన్ ప్రభుత్వంలో ఏదో దొరుకుతుందనుకుంటే , ఇంత వరకూ స్కాం అనేది లేకపోవడం బాబుకు మింగుడు పడని విషయం. ఇక రెండో దెబ్బ అమరావతి. అక్కడ రైతుల భూములు ఎన్నో, బడా బాబుల భూములు ఎన్నో బాబుకి లెక్కలు తెలుసు, జగన్‌కి తెలుసు. అక్కడ విల్లాలు కడుతున్నది ఎవరో, భూములు పోగొట్టుకున్న పేద రైతులు ఎవరో ఇద్దరికీ తెలుసు. అందుకే ప్రజలు డబ్బుని తెలుగుదేశం బినామీలకి ధారబోయడం ఇష్టం లేక జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాడు. మండలిలో అడ్డుకుని తెలివైన పని చేశాననుకున్నాడు బాబు. మండలిని క్లోజ్ చేయాలనుకున్నాడు జగన్. ఇది మూడో దెబ్బ.
Read Also: అధిష్టానాన్ని కలవరపెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీలు, రసవత్తరంగా మండలి రాజకీయం
సరే, మండలి క్లోజ్ అవుతుందా, తెలుగుదేశం క్లోజ్ అవుతుందా అనేది రెండు మూడు రోజుల్లో తేలుతుంది. కాకపోతే వైసీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు చంద్రబాబు దక్షతకి ముగ్దులై, లేదా జగన్ నిరంకుశత్వానికి తట్టుకోలేక , ప్రజాసేవ కోసం విలువలకు కట్టుబడి అని రాసిన పత్రికలు, ఇపుడు టీడీపీ నుంచి ఎవరు వెళ్లినా ప్రలోభాలకు గురై , డబ్బులకి అమ్ముడుపోయి అని రాస్తాయి, రాస్తున్నాయి. ఇది జర్నలిజం విషాదం అనాలో! విషం అనాలో తెలియదు.
మండలి రద్దు అయినా , కాకపోయినా తెలుగుదేశానికి గట్టి దెబ్బే. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోతే పార్టీ ఖాళీ. ఒకవేళ వెళ్లకపోయినా రాబోవు రోజుల్లో వైసీపీ బలం పెరుగుతుంది. (రద్దైతే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది కమ్యూనిస్టులే. సమీప భవిష్యత్‌లో వాళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు)
Read Also: జగన్ రద్దు చేస్తే.. చంద్రబాబు పెడతారట..
ఈ నేపథ్యంలో పార్టీని నిలుపుకోవడం ఒక సమస్య అయితే, బాబుకి పాత కేసులన్నీ చుట్టుముట్టడం అసలు సమస్య. గతంలో లక్ష్మిపార్వతి వేసిన కేసు, ఓటుకు నోటు, ఏలేరు స్కాం, పోలవరం అన్నీ వచ్చి మెడకి చుట్టుకుంటున్నాయి. ఈ సారి బాబుకి కృష్ణజన్మ స్థానం తప్పేలా లేదు.
చంద్రబాబు అరెస్ట్ అనే వార్త చాలా తొందరలోనే బ్రేకింగ్ న్యూస్‌లో వస్తుంది. వెంకయ్యనాయుడి హవా తగ్గిపోయింది కాబట్టి బీజేపీ అడ్డుపడే అవకాశం లేదు. ఆ అవసరమూ వాళ్లకి లేదు. బాబు వల్ల ఏ ఉపయోగమూ సమీప భవిష్యత్‌లో లేదని తెలుసు. మిత్రుడు పవన్‌కల్యాణ్‌కి ఢిల్లీని కన్విన్స్ చేసే సీన్ లేదు. రాజగురువే కేసుల్లో ఇరుక్కుంటున్నాడు కాబట్టి ఆయన తలనొప్పి ఆయనది. గాలివాన ప్రారంభమైంది. తుపానులో పడవ ప్రయాణం. ఒడ్డు కనపడ్డం లేదు. వ్యూహాల వల్ల ఎంతో కాలం పోరాడలేం. సైనిక శిక్షణ కూడా తెలియాలి. చంద్రబాబు వ్యూహకర్తే కానీ, వీరుడు కాదు.
ఇక బాబు జైలుకి వెళితే లోకేశ్ పార్టీని నడపలేడు. ఎందుకంటే అతనికి జెయిల్ (JAIL)కి , బెయిల్(BAIL)కి తేడా తెలియదు కాబట్టి.