అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేసారంట ‌– చంద్రబాబు హంగామా..

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు డ్రామాలు మొదలు పెట్టేశాడు. ఇఎస్ఐ కుంభకోణంలో కీలక పాత్రదారుడన్న ఆరోపణలపై ఏసిబి అధికారులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదుపులోకి తీసుకున్న తర్వాత ఏసిబి అధికారులు అచ్చెన్నను విజయవాడకు తీసుకెళుతున్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు విచిత్రమైన డిమాండ్లు మొదలుపెట్టేశాడు. ఎవరో మాజీ మంత్రిని కిడ్నాప్ చేసినట్లు యాగీ మొదలుపెట్టేశాడు. విచిత్రమేమిటంటే అచ్చెన్న ఆచూకీ చెప్పాలంటూ గోల మొదలుపెట్టేశాడు.

టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడలోనే అచ్చెన్నను గురువారం అర్ధరాత్రిపైన అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ నిమ్మిత్తం మాజీ మంత్రిని విజయవాడకు తరలిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం అచ్చెన్న ఆచూకీ కనబడటం లేదని గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా దాదాపు రూ. 157 కోట్ల కుంభకోణంలో అచ్చెన్న పాత్ర ఉందని నిర్ధారణ అయిన తర్వాతే ఏసిబి యాక్షన్లోకి దిగింది.

Also Read:అచ్చెన్నాయుడు అరెస్ట్‌

వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం అచ్చెన్నను అరెస్టు చేయటమంటే బలహీనవర్గాలపై దాడులుగా అభివర్ణించటమే విచిత్రంగా ఉంది. అవినీతికి కులమేంటి ? మతమేంటి ? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడా లేదా అని మాత్రమే చూస్తారు. అదుపులోకి తీసుకోవటానికి లేకపోతే అరెస్టు చేయటానికి తగినన్ని ఆధారాలుంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు జరిగింది కూడా అదే. మందులు, వైద్య పరికరాలు కొనుగులులో టెలి సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా అవసరం లేకపోయినా కొనుగోళ్ళు జరిపినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు దర్యాప్తులో నిర్ధారించింది. దాంతో ఏసిబి రంగంలోకి దిగింది.

ఆమధ్య వైజాగ్ జిల్లాలోని నర్సీపట్నం ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియా ఇలాగే గోల చేసింది. ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడిన డాక్టర్ సస్పెండ్ అవ్వగానే దళిత కార్డు బయటకు తీశారు. సదరు డాక్టర్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టేసి దళిత డాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుందంటూ ఎంత గోల చేశారో అందరు చూసిందే. మొత్తం మీద తమకు ఎప్పుడు ఇబ్బందులు మొదలవుతాయని అనిపించినా వెంటనే కులంకార్డును బయటకు తీయటం చంద్రబాబు అండ్ కో బాగా అలవాటైపోయింది.

Show comments