iDreamPost
iDreamPost
సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, ఇదే మాట ఆయన నోటి నుండి కూడా అనేక సార్లు విన్నాం, తాజాగా నేడు తలెత్తిన కరోనా సంక్షోబాన్ని తన హయాంలో జరిగిన ఒక భారీ అవినీతిని చెరుపుకోవడానికి అవకాశంగా వాడుకుంటున్నట్టు తెలుస్తుంది ఆయన వ్యవహార శైలి చూస్తుంటే. తన హయాంలో విశాఖపట్నంలో “విశాఖ మెడ్ టెక్ జోన్” ఏర్పాటు చేశామని, అన్ని వైద్య పరికరాలు తయారు చేసేలా 100 సంస్థలు ఏర్పాటు చేశామని, 2019 మే వరకు అనేక కంపెనీలతో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీలో ముందున్న విశాఖ మెడ్ టెక్ జోన్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండే నిర్లక్ష్యనికి గురైందని, తన హాయములో నెలకొల్పారనే అక్కసుతో ఈ ప్రాజెక్టూను మూసేశారని. ఇది మంచి పద్దతి కాదని ముఖ్యమంత్రికి లేఖ అనే నెపంతో ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు.
సరిగ్గా ఇక్కడే చంద్రబాబు వ్యవహార శైలి పైన చెప్పుకున్నట్టుగా కరోనా సంక్షోభంలో అవకాశాన్ని వెతుక్కున్నారు. తన హయాములో ఒక మహాద్బుతాన్ని సృష్టించానని , జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అక్కస్సుతో దానిని నిర్వీర్యం చేశాడని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడమే లక్ష్యంగా ముందుకు తెచ్చిన విశాఖపట్నం మెడ్ టెక్ జోన్ వ్యవహారం గురించి వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే అది బాబు గారి హయాం లో జరిగిన అనేక కుంభకోణాల్లో ఇది ఒక వందల కోట్ల కుంభకోణం. కానీ బాబు గారు ఆ వాస్తవాన్ని కప్పి పుచ్చి జగన్ నిర్వీర్యం చెస్తునట్టు ఒక ఆరోపణ చేశారు.
నిజానికి ఈ జోన్ ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారని, పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో రియలెస్టేటు వ్యాపారం చేశారని విమర్శలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆనుకుని మెడ్ టెక్ జోన్ కు కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని భవానాల నిర్మాణం , భూమి చదును కోసం 2017లోనే టెండర్లు పిలిచారు. వాస్తవంగా 500కోట్లతో అయిపొయే పనులని 2,400 కోట్లకు సుమారు 300% అధికంగా ల్యాంకో ఇన్ ఫ్రా కు అప్పచెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్‌ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది.
ఇలా రద్ధు చేసిన సంస్థకు 300% కు పెంచి పనులు అప్పచెప్పడం వెనక, ఆనాడు లగడపాటి రాజ్ గోపాల్ కు లబ్ది చేకూర్చడానికే ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అనాడు ప్రతిపక్షంలో ఉన్న వై.యస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంతో దిగివచ్చిన చంద్రబాబు ల్యాంకో ఇన్ ఫ్రా కు ఇచ్చిన టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లకు పిలిచారు. దీంతో వేలకోట్ల అవినీతి సొమ్ము ప్రభుత్వ పెద్దలు కాజేయకుండా బ్రేక్ పడినట్టయింది. అయితే ఏస్క్రొ ఖాతా తెరవని ల్యాంకో ఇన్ ఫ్రా సంస్థకు టెండర్లు రద్దయైన రోజే నిధులు మళ్ళించడం విశేషం. టెండర్లు రద్దు చేసిన సంస్థకు డబ్బులు ఎందుకు చెల్లించారో నేటికి సమాదానం దొరకని ప్రశ్న ? అలాగే టెండర్లు రద్దయిన రోజే 12 కోట్ల రూపాయలు మెడ్ టెక్ జోన్ నిధులు ఒక ఖాతా నుండి మరో ఖాతాలోకి మార్చడం విశేషం.
అయితే సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే ఉందనగా 2018 డిశంబర్ 13న చంద్రబాబు చేతుల మీదగా ప్రారంభమయిన ఈ మెడ్ టెక్ జోన్లో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలకు, ఊరు పేరు లేని కంపెనీలతో ఏం.ఓ.యులు చెసుకోవడమే కాకుండా ఏకంగా ఎకరం 5కోట్లు చొప్పున మొత్తం 1,350 కోట్లు విలువ చేసే భూమిలో అనుయాయులకు , నచ్చిన వారికి ఎకరం 25 లక్షల కంటే తక్కువ దరకు 33ఏళ్ళ కు లీజుకు కట్టబెట్టారు. మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు వల్ల రూ.5 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం దీగిపొయే సమయానికి వచ్చింది ఓక్సిల్ గ్రిడ్స్, ఎస్‌ఎస్ మేజర్, ఫీనిక్స్ వంటి కేవలం 10 కంపెనీలే కానీ బాబు గారు లేఖలో 100 కంపెనీలు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. పైగా మెడ్‌టెక్ జోన్‌లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పరిపాలనా భవనం ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే లోపల ఫ్లోరింగ్ 3 అడుగుల మేర కుంగిపోయింది అంటే నిర్మించిన నాలుగు షేడ్లలో కూడా ఎంత నాణ్యతా లోపం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒకదాని మీద మరొకటి జరిగిన అంతులేని అక్రమలపై విజిలెన్స్ అధికారుల చేత విచారణకు పూనుకుంటే. విచారణ చేపట్టడానికి మెడ్‌టెక్ జోన్‌లోకి మమ్మల్ని అనుమతించలేదని. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల బృందం ఆనాడు చెప్పారంటే ఎంత అవీనీతి పుట్టని దాచారో అర్ధం చెసుకోవచ్చు.
ఇలా చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి మరకలతో అప్రదిష్ట పాలైన మెడ్ టెక్ జోన్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాగానే కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన వందల కోట్ల అక్రమాలపై దృష్టి సారించింది. నాడు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇవ్వలని అధికారులను కోరింది. కొత్తగా మెడ్ టెక్ జోన్ కు బోర్డ్ అఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా మరో 11 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులను ఈ కమిటీలో సభ్యులను నియమించారు. ఇక తాజాగ మంత్రి గౌతం రెడ్డి నిన్నటి నాడు నిర్వహించిన రివ్యు మీటింగ్ లో మెడ్ టెక్ జోన్ లో కొత్తగా ఏర్పడిన సంస్థల సహాయంతో కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడేలా 3000 వెంటిలేటర్లు 25వేల టెస్టింగ్ కిట్లను రాబోయే 10 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగునా భారీ కుంభకోణానికి నిలయమైన మెడ్ టెక్ జోనుని, నేడు ఉన్న సంక్షోభ కాలాన్ని అవకాశంగా మలుచుకుని అవాస్థవాలతో ముఖ్యమంత్రి జగన్ మెడ్ టెక్ జోన్ ని నిర్లక్ష్యం చేస్తునట్టు, గత ప్రభుత్వం నిర్వాకం వలన అరకొరా గా ఉన్న కంపెనీలను 100 కంపెనీలు గా మార్చి చెబుతూ , నాణ్యత లోపించిన కట్టడాలను మహా భవంతులుగా అభూత కల్పనలు సృష్టిస్తూ చంద్రబాబు చేస్తున్న రాజకీయం హేయం . నిజానికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అంటే అనేక విదాలుగా ఇచ్చే అవకాశం ఉన్నా, ఇలా తన హయాములో జరిగిన కుంభకోణం ముద్రను చెరుపుకునే రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఇవ్వన్ని చూస్తే ఓటమి చంద్రబాబులో మార్పు తెచ్చినట్టు కనిపించడంలేదు.