iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్‌కు కరోనా

చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్‌కు కరోనా

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్‌కు కరోనా వైరస్‌ సోకింది. దాదాపు నెల రోజుల పాటు సదరు కానిస్టేబుల్‌ చంద్రబాబు ఇంటి వద్ద బందోబస్తు విధులు నిర్వర్తించిన ఇటీవలే స్వస్థలానికి చేరుకున్నారు. బాపట్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేసే సదరు కానిస్టేబుల్‌ గత నెల 5వ తేదీన విధుల్లో భాగంగా హైదరాబాద్‌ వచ్చారు. నెల రోజులకుపైగా జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు బంగ్లా వద్ద బందోబస్తు విధులు నిర్వర్తించారు.

తన డ్యూటీ ముగియడంతో సదరు కానిస్టేబుల్‌ ఈ నెల 7వ తేదీన బాపట్ల వచ్చారు. అనంతరం ఆనారోగ్యం బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వైద్య పరీక్షలు జరిపారు. పరీక్షల్లో సదరు కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిసింది. హైదరాబాద్‌లో చంద్రబాబు బంగ్లా వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తోటి కానిస్టేబుల్‌ నుంచి ఇతనికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.