iDreamPost
android-app
ios-app

బాబు పోలిక పవన్‌కు తగిలింది

బాబు పోలిక పవన్‌కు తగిలింది

రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన పోలిక నేరుగా ఆయన మాజీ పార్టనర్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు తగిలింది. చంద్రబాబు తెలిసి పోల్చాడో.. లేక తెలియక పోల్చారో గానీ మూడురాజధానుల ప్రతిపాదనను కుటుంబాలతో పోల్చారు. నిన్న బుధవారం ప్రజాచైనత్య యాత్రలో ఒంగోలులో చంద్రబాబు ప్రసంగంలోని ఈ భాగం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్కైంది.

జగన్‌ మూడురాజధానులు ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నచంద్రబాబు.. ఎవరైనా మూడు కుటుంబాలు పెట్టుకుంటారా..? అంటూ తమ్ముళ్లను ప్రశ్నించారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని, ఒక వ్యక్తి ఒకే కుటుంబం.. అనే రీతిలో చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలోనూ మూడు రాజధానుల ప్రతిపాదనను ఒక వ్యక్తి మూడుకుటుంబాలు పెట్టుకోవడంతో పోల్చారు. ఈ పోలికపై సోషల్‌ మీడియాలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై సెటైర్లు పేలుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడు రాజధానులు మూడు పెళ్లిళ్లతో సమానం అనేలా చంద్రబాబు పోల్చారు. ఈ పోలిక ప్రత్యక్షంగా పవన్‌ కళ్యాణ్‌కు తాకింది. బాబు మూడురాజధానులపై మాట్లాడిన మాటలు.. పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించే చేశారంటూ సోషల్‌ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş