iDreamPost
android-app
ios-app

జగన్ లా చంద్రబాబు కూడా లేఖ రాయొచ్చుగా..?

జగన్ లా చంద్రబాబు కూడా లేఖ రాయొచ్చుగా..?

అప్పట్లో అంటే 2016 లో ‘ఇన్కం డిక్లరేషన్ స్కీం’ కింద అప్పటి వరకు పన్ను కట్టని ఆదాయాన్ని ప్రకటించి అందులో 45 శాతం పన్ను కింద ప్రభుత్వానికి కడితే దాన్ని నల్లధనంగా కాకుండా ఆదాయం కింద గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 65 వేల కోట్ల రూపాయల నల్లధన వివరాలను ప్రకటించగా హైదరాబాద్ నుంచి 13 వేల కోట్లు.. అందులో 10 వేల కోట్లు ఒకే వ్యక్తి ప్రకటించారు.

ఆ పదివేల కోట్లు ప్రకటించింది జగన్ నే అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆ పార్టీకి చెందిన అప్పటి ఇద్దరు మంత్రులు, శాసనసభ్యులు ఏకంగా ఆ పదివేల కోట్ల నల్లధనం ప్రకటించింది వైఎస్ జగన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. టిడిపి అనుకూల మీడియాలో టీడీపీ నేతల ప్రకటనలు యధావిధిగా అచ్చయ్యాయి.

ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ఆ నల్లధనం ప్రకటించిన వారి సమాచారం మొత్తాన్ని బహిరంగపరచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కట్ చేస్తే.. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్ లో జరిపిన తనిఖీల్లో 2000 కోట్ల రూపాయలు లెక్క తేలని ధనం పట్టుబడినట్టు ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ నోట్ ప్రకారం ‘ప్రామినెంట్ పర్సన్’ అనే మాటను యథాతథంగా ‘మన’ వాళ్ళ మీడియా ‘ప్రముఖుడు’ అని అనువదించి అచ్చేశారు. అధికార వైసీపీ, సాక్షి పేపర్ మాత్రం ఆ ‘ప్రముఖుడు’ చంద్రబాబు నాయుడు అని రాశాయి.

గాంధీలా బతుకుతున్న చంద్రబాబు, నిప్పు లాంటి చంద్రబాబు తన మీద ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆ ప్రముఖుడెవరో బహిరంగ పరచాలని కోరుతూ ఆదాయపు పన్ను శాఖ వారికి, కాపీ టు సీఎం, కాపీ టు పీఎం అంటూ గతంలో జగన్ రాసినట్లు ఒక లేఖ రాయొచ్చు కదా ?!. ఆ దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తారా..?