iDreamPost
android-app
ios-app

కొంప ముంచిన చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్

కొంప ముంచిన చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్

రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి తరపున వ‌ర్ల రామ‌య్య‌ను బ‌రిలోకి దించ‌డం ద్వారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేసే ప్ర‌య‌త్నం చేశారు. సామాజిక తరగతి తీసుకొచ్చి చర్చకు లేవదీశారు. ఎలాగూ బ‌లం లేద‌నే క్లారిటీ ఉన్నా చంద్ర‌బాబు త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిని బ‌రిలోకి దించారు. అది కూడా ద‌ళిత అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌డం ద్వారా ద‌ళిత అభ్య‌ర్థిని వైసిపి ఓడించింద‌ని, ఎస్సీలు రాజకీయంగా ఎదగనియ్యకుండా వైసిపి‌ చేసిందని అంటూ మ‌రో రాజ‌కీయం చేయొచ్చ‌నేది చంద్ర‌బాబు మార్కు వ్యూహం అని స్ప‌ష్టం అవుతూనే ఉంది. కానీ చంద్రబాబు దుర్భుద్ది ప్రజలకు తెలియడంతో ఆ పాచికలు పారలేదు.

అయితే చంద్రబాబు రాజకీయాలు చేయాలనే కుట్రలకు మొద‌ట్లోనే కౌంట‌ర్లు ప‌డ్డాయి. పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ సీటును నెగ్గే ఆవ‌కాశం లేని స‌మ‌యంలో ద‌ళితుడికి టికెట్ ఇచ్చార‌ని, అదే గెలిచే అవ‌కాశం ఉంటే తన సామాజిక వర్గం వాళ్ల‌కో, డ‌బ్బున్న వ్యాపారస్తులకో ఆ సీటు ద‌క్కేద‌ని అనేక మంది దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న‌ ఐదేళ్ల కాలంలో ఒక్క దళితుడుకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదు. అలాగే ఏలాగూ ఓటమి చెందుతామని తెలిసి ఇప్పుడు బరిలో‌కి దింపిన ఏదైతే దళిత అభ్యర్థి ఉన్నాడో…ఆయనకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాజ్యసభ ఇవ్వలేదు. చంద్రబాబు పాలనలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు ఇస్తారని తీవ్రస్థాయిలో చర్చ‌ జరిగింది. టిడిపి నేతల నుంచి ఇతర పార్టీ నేతల వరకు వర్ల రామయ్యకు టిక్కెట్ కన్ఫమ్ అయిందనే అనుకున్నారు. కాని చివరి నిమిషంలో ఆయనకు మొడ్డి చెయ్యి చూపించారు. ఆ తరువాత కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. అలా చంద్ర‌బాబు మార్కు కుటిల వ్యూహానికి మొద‌ట్లోనే కౌంట‌ర్లు ప‌డ్డాయి.

అది పక్కన పెడితే టిడిపి గెలవదని తెలిసి అభ్యర్థిని పోటీ పెట్టడంలో వల్ల ఈ వ్య‌వ‌హారం పోలింగ్ వ‌ర‌కూ వ‌చ్చింది. వ‌ర్ల రామ‌య్య చేత నామినేష‌న్ వేయించిన చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌ను గెలిపించేందుకు చేసింది ఏమిటి? అంటే ఏమీ లేదు. చంద్రబాబు చేసింది శూన్యం. ఆఖ‌రికి సొంత పార్టీ ఓట్లు కూడా పూర్తి స్థాయిలో ప‌డ‌లేదు. ఏకంగా ఆరు ఓట్లు తగ్గాయి. కార‌ణాలు ఏవైనా ప‌డాల్సిన ఆరు ఓట్లు  ప‌డ‌లేదు. త‌ద్వారా త‌మ బ‌లం ఏమిటో చంద్ర‌బాబే నిరూపించుకున్న‌ట్టుగా అయ్యింది. సొంత ఓట్లు కూడా వేయించుకోలేని దుస్థితిలో‌ చంద్రబాబు ఉన్నారు.

ఒక టిడిపి ఎమ్మెల్యే అయితే డైరెక్టుగా బ్యాలెట్ పేప‌ర్ మీదే రాశాడ‌ట‌. గెలిచే సీటు అయితే మీ సొంత సామాజిక‌ వ‌ర్గానికి, ఓడే సీటు మాత్రం ద‌ళితుల‌కా.. అంటూ  ప్ర‌శ్నించాడ‌ట‌! ఈ రకంగా టిడిపికి పరిస్థితి దాపురించింది. ఏక‌గ్రీవంగా ఈ ఎన్నిక పూర్త‌యి ఉంటే టిడిపి లోగుట్టు ఇలా ర‌చ్చకు ఎక్కేదే కాదేమో అనిపిస్తోంది. కాని టిడిపి అధినేత చంద్రబాబు సెల్ఫ్ గోల్ వల్ల ఆ పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగ పడ్డాయి. అభ్యర్థి విషయంలో ముందుకు తీసుకొచ్చిన కుల‌ అంశంలో కూడా టిడిపినే ముద్దాయిగా ఉంది. గతంలో గెలిచే పరిస్తితుల్లో దళితులకు టికెట్ ఇవ్వని చంద్రబాబు, ఓటిమి‌ చెందుతామని తెలిసి కూడా దళితులకు టిక్కెట్ ఇవ్వడంతో ఆ వర్గాన్ని అవమానించారనే చర్చ ముందుకు‌ వచ్చింది.

విప్ జారీ చేయ‌వ‌చ్చ‌ని, త‌ను చెప్పిన‌ట్టుగా ఓటేయ‌ని ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్లు పెట్టొచ్చ‌నేది కూడా చంద్ర‌బాబు వ్యూహం కావొచ్చు. అయితే ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు ఆయ‌న‌క‌న్నా మేధావులు. ఓటేసిన‌ట్టే వేసి..దాన్ని చెల్ల‌కుండా చూసుకున్న‌ట్టున్నారు. అందుకు గురువును మించిన శిష్యులుగా టిడిపి ఎమ్మెల్యేలు నడుచుకున్నారు. చంద్ర‌బాబు సూప‌ర్ సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని, ఇది ఆ పార్టీకి నష్టం జరిగిందని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదొక్కటే కాదు ప్రతి అంశంలో చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేస్తారు. చివరికి అది బెడిసి కొడుతుంది. ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు సెల్ఫ్ గోలే తమ పార్టీకి ముప్పు తెచ్చిందని కొంతమంది టిడిపి నేతలు కూడా నోళ్లు కొరుక్కుంటున్నారు.