iDreamPost
android-app
ios-app

కేంద్ర బడ్జెట్‌.. రంగాలు..కేటాయింపులు..

కేంద్ర బడ్జెట్‌.. రంగాలు..కేటాయింపులు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020– 2021 బడ్జెట్‌ను ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. త్వరలో కొత్త విద్యా విధానం తెస్తామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను సరిళీకరణ వల్ల రాబడి పెరిందని తెలిపారు. జీఎస్టీని మరింత సరళతరం చేస్తామన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. రైల్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రైళ్లు నడుపుతామని వెల్లడించారు. మరిన్ని తేజస్‌ రైళ్లు వస్తాయన్నారు. లక్ష గ్రామాలకు ఫైబర్‌నెట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలను గురించి వివరించిన ఆమె ఆ తర్వాత రంగాల వారీగా లక్ష్యాలు, కేటాయింపులు వెల్లడించారు.

Read Also: జమ్మూ కశ్మీర్‌పై కరెన్సీ వర్షం..

– వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు రూ. 2.83 లక్షల కోట్లు

– రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు.

– విద్యారంగానికి రూ. 99,300 కోట్లు.

– నైపుణ్య శిక్షణకు రూ. 3 వేల కోట్లు.

– 6500 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.1.03 లక్షల కోట్లు.

– విద్యుత్‌ రంగానికి రూ.22 వేల కోట్లు.

– ఎస్సీల అభివృద్ధికి రూ. 85,000 కోట్లు

– ఎస్టీల అభివృద్ధికి రూ. 53,700 కోట్లు

– క్లీన్‌ ఎయిర్‌పాలసీకి రూ. 4,400 కోట్లు

– నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌కు .1480 కోట్లు.

– మహిళా సంక్షేమానికి రూ. 28,600 కోట్లు

– పౌష్టికాహారానికి రూ. 35,000 కోట్లు

– దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు.

– సాంసృతిక శాఖకు రూ. 3,150 కోట్లు.