iDreamPost
iDreamPost
పాన్ ఇండియా దెబ్బకు మన దర్శక నిర్మాతల ఆలోచనలు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ కు సైతం సాధ్యం కానీ బడ్జెట్ లు కాంబినేషన్లు సెట్ చేస్తూ తెలుగు డైరెక్టర్లు ఇస్తున్న షాకులు మాములుగా లేవు. ఆ మధ్య విజయ్ దేవరకొండ లైగర్ కోసం ఏకంగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని ఒప్పించడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు ఏ భారతీయ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేయని ఈయన ఏకంగా పూరి జగన్నాధ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం షాకే. దీని వెనుక కరణ్ జోహార్ పలుకుబడి ఉండొచ్చు. కారణం ఏదైనా సరే బజ్ రెట్టింపు అయ్యేందుకు ఓవర్ సీస్ మార్కెట్ కు ఈ అంశం కీలకం కానుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు తమన్ కూడా ఓ అంతర్జాతీయ తారను తన ఆల్బమ్ కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో బ్రిట్నీ స్పియర్స్ తో ఓ పాట పాడించేందుకు ప్లాన్ చేసుకున్నారట. ప్రస్తుతం యుఎస్ లో ఉన్న ఈ హాట్ సింగర్ ఓకే చెప్పాలంటే రెమ్యునరేషన్ భారీగా ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజమైతే గాడ్ ఫాదర్ మ్యూజిక్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో లైవ్ కన్సర్ట్లు తగ్గించిన బ్రిట్నీ మరి తమన్ ప్రతిపాదనకు ఏమంటుందో చూడాలి. ఓకే అంటే మాత్రం రికార్డే.
ఈ ట్రెండ్ ని గమనిస్తే తెలుగు సినిమా స్థాయిలో ఎక్కడి దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, సాహో, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి ప్రాజెక్టులు జపాన్, చైనా లాంటి దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి సినిమాలకు వరల్డ్ అప్పీల్ ఉండాలంటే మైక్ టైసన్, బ్రిట్నీ స్పియర్స్ లాంటి వాళ్ళు చాలా అవసరం. ఈ వార్త నిజమైతే టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ కు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ ఇలాంటి ప్రయోగాలు చేసేవాడు. తర్వాత ఎవరూ ఈ తరహా సాహసాలకు పూనుకోలేదు. తమన్ సిద్ధపడుతున్నాడు. చూద్దాం ఎంతవరకు ఇది వాస్తవ రూపం దాల్చుతుందో
Also Read : మా కథలు అప్పుడే అయిపోలేదు