జీ-20 సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుబోతోంది. దీని కోసం ఢిల్లీ సర్వ సుందరంగా ముస్తాబైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ఈ అత్యున్నత సదస్సు ఏర్పాటైంది. ఆ సదస్సును దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. ఇక జీ-20లో పాల్గొన్ని అమెరికా, బ్రిటన్ వంటి వివిధ దేశాల అధినేతలు ఈ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలు సదస్సును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే సనాతన ధర్మంపై వివాదం జరుగుతున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హిందుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఈ జీ-20 సదస్సులో పాల్గొనడానికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం.. భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యాన ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
హిందువుగా గర్విస్తున్నాని, తన మూలాలు అవేననీ రిషి సునాక్ అన్నారు. ఇక్కడున్న ఈ రెండు రోజుల్లో తీరిక చేసుకుని ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. భారతీయ సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వన్ ఫ్యామిలీ అనే గొప్ప థీమ్ తో ఈ సదస్సు జరగుతోందని, అదే ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. జీ-20 సదస్సు నిర్వహణ భారత్ సాధించిన ఘన విజయమని రిషి సునాక్ కొనియాడారు.
మెడీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని ఆయన అన్నారు. అలానే ఇక్కడ జరుపుకునే రాఖీ పండగ ఇప్పటికి గుర్తుందని, ఈ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నామని, రాఖీలన్నింటినీ జాగ్రత్తగా దాచి పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు. అయితే సనాతన ధర్మంపై వివాదం కొనసాగుతున్న వేళ.. బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.