iDreamPost
android-app
ios-app

బ్రహ్మాస్త్రం వెనుక బద్దలయ్యే రహస్యం

  • Published Jun 15, 2022 | 12:13 PM Updated Updated Jun 15, 2022 | 2:24 PM
  • Published Jun 15, 2022 | 12:13 PMUpdated Jun 15, 2022 | 2:24 PM
బ్రహ్మాస్త్రం వెనుక బద్దలయ్యే రహస్యం

భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచి రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇలా ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే నిజ జీవితంలో భార్యాభర్తలైన రన్బీర్ కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లు కావడం దీనికి ప్రధాన ఆకర్షణ. అమితాబ్ బచ్చన్ తో పాటు అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ కి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో డబ్బింగ్ చెప్పించడం విశేషం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. మరి అందులో హైప్ కు తగ్గట్టు మ్యాటర్ ఉందొ లేదో చూద్దాం.

శివ(రన్బీర్ కపూర్)అనే యువకుడికి పాటలే లోకం. ప్రేయసి(అలియా భట్)తో కలిసి జీవితం అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే అతనికో దివ్య శక్తి ఉంటుంది. నిలువెత్తు మంటల్లో తోసేసినా ఏమి కాదు. కాలిపోవడం కాదు కదా కనీసం చిన్న మచ్చ కూడా పడదు. కానీ దానికి కారణం ఏంటో తెలియదు. మరోవైపు లోకకళ్యాణం కోసం ఉద్దేశించిన బ్రహ్మాస్త్రం కోసం ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి శివకి ముడిపెట్టి ఉంటాడు దేవుడు. అసలు శివకి ఇలాంటి సూపర్ పవర్ ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న లయకారకుడి ఉద్దేశం ఏంటి లాంటి బోలెడు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకో రెండు నెలలు ఆగాలి.

అయాన్ ముఖర్జీ తీసుకున్న లైన్ బాగానే అనిపిస్తున్నా విఎఫ్ఎక్స్ అంత ఆకర్షణీయంగా లేదు. ఒకటి రెండు షాట్లు తప్ప మిగిలినవాటిలో ఊహించనినంత క్వాలిటీ కనిపించలేదు. అంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పుడు గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ రాజీపడిన దాఖలాలు ఉన్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇవేం విజువల్ ఎఫెక్ట్స్ అంటూ నెటిజెన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ తదితరులను అలా చూపించి ఇలా మాయం చేశారు. మొత్తానికి ఎగ్జైటింగ్ అనిపించే స్థాయిలో ఈ ట్రైలర్ లేదు. అసలు కంటెంట్ సినిమాలో ఉందేమో. అయినా అందరూ రాజమౌళిలు కాలేరుగా చూద్దాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet