iDreamPost
iDreamPost
బాలీవుడ్‌లో అధిక బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎప్పట్నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద బాగా కాన్సంట్రేట్ చేశారు చిత్ర యూనిట్. టాలీవుడ్ లో ఒక పక్క రాజమౌళిని ప్రమోషన్స్ కి వాడేస్తూనే తాజాగా మరో పక్క చిరంజీవితో ఇటీవలే సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పించారు.
తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కూడా చిరంజీవి వాయిస్ తో ఉంది. తాజాగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీనికి మిశ్రమ స్పందన లభిస్తుంది. ట్రైలర్లో ఎక్కువగా VFX లు వాడారు. ఒక సాధారణ ప్రేమ, రివెంజ్ కథకి హాలీవుడ్ రేంజ్ లో VFX లు జత చేసి మన దేశ పురాణాల ప్రకారం ఉన్న అస్త్రాలను వాడి ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ట్రోల్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో అయితే అంజి, ఢమరుకం లాంటి సినిమాలు ఇలాంటివే వచ్చాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ఎందుకంటే.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లోని ఒక సన్నివేశమే ఈ బాయ్‌కాట్ కి కారణం. బ్రహ్మాస్త్ర ట్రైలర్‌లో ఓ సన్నివేశంలో రణ్‌బీర్ కపూర్ గుడిలోకి వెళ్తూ గంటలు కొడతాడు. అయితే ఆ సమయంలో రణ్‌బీర్ షూ ధరించి ఉన్నాడు. ఇప్పుడు ఇదే విమర్శలకు కారణంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘#BycottBrahmastra’ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ‘బాలీవుడ్ షూలతో గుడిలోకి వెళ్లింది. ఈ మూవీని బాయ్‌కాట్ చేయండి’, ‘ఎందుకు అతను షూలతో టెంపుల్‌లోకి వెళ్లాడు’, ‘గుడిలోకి షూలతో వెళ్తారా’.. అంటూ పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తూ బ్రహ్మాస్త్రాన్ని బాయ్‌కాట్ చేయండి అంటున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
Entering Temple with shoes, this is what we can expect from Urduwood. Bollywood never misses a chance to hurt our sentiments towards Sanatana Dharma.#BoycottBollywood #BoycottBrahmastra pic.twitter.com/Pa5hmX99Ag
— 🚩 (@Chand_Bardai) June 15, 2022
I Am Ready to #BoycottBrahmastra
What about you? #BoycottBollywood
CBI Do Justice To Sushant pic.twitter.com/YEoACI4zRj— KumardeepRoy(DETECTIVE BYOMKESH) (@I_Am_Roy18) June 16, 2022
#RanbirKapoor is Shown Wearing Shoes and Ringing a Bell in Temple #Brahmastra
#Bollywood Will Never Stop Insulting Hinduism.#BoycottBollywood ❌#BoycottBrahmastra ❌#BrahmastraTrailer ❌ #KaranJohar ❌But Rabel Star #Prabhas Worships God Blockbuster #Adipurush.☑️ #RRRMovie pic.twitter.com/IXMIu9Wroo
— ℝ𝕒𝕞 𝕔𝕙𝕒𝕣𝕒𝕟 📿🚩🚩 (@Boss42265174) June 15, 2022
Why he Is entering Temple with shoes #BoycottBrahmastra pic.twitter.com/YJGyauTD1z
— Shashikanth Reddy (@Shashi26214076) June 15, 2022
No matter how many religious films you make, these Bollywood people always build mistakes, that's why I don't trust Bollywood. #jagohindu #BoycottBollywood #BoycottBrahmastra #BoycottBrahmastraMovie #WeWantHinduRashtra pic.twitter.com/z79rA2Etac
— Ankit Ranjan Singh (@AnkitSingh13_) June 16, 2022
Waah re bollywood entering temple with shoes on. Boycott this movie!!!
Let them feel our power!!!
Aakhir kab tak urduwood bane rahoge#BoycottBrahmastra pic.twitter.com/uwdvwzD3lE— ईशा 🕉️ (@iishapradhan_) June 15, 2022