iDreamPost
android-app
ios-app

బ్రహ్మాస్త్రం మీదే బాలీవుడ్ బరువు

  • Published Aug 27, 2022 | 5:42 PM Updated Updated Dec 07, 2023 | 11:01 AM

రన్బీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ అల్ట్రా గ్రాండియర్ విజువల్ వండర్ ని మొత్తం మూడు భాగాల్లో తీసుకురాబోతున్నారు.

రన్బీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ అల్ట్రా గ్రాండియర్ విజువల్ వండర్ ని మొత్తం మూడు భాగాల్లో తీసుకురాబోతున్నారు.

బ్రహ్మాస్త్రం మీదే బాలీవుడ్ బరువు

ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ సెప్టెంబర్ 9న విడుదల కాబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీదే ఉన్నాయి. రన్బీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ అల్ట్రా గ్రాండియర్ విజువల్ వండర్ ని మొత్తం మూడు భాగాల్లో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వచ్చేది మొదటిది. నాగార్జున ఓ కీలక పాత్ర చేయడంతో తెలుగులోనూ చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్రను ప్యాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేశారు. దాదాపు నేషనల్ వైడ్ మల్టీ ప్లెక్సులు అన్నింటిలోనూ ప్రత్యేకంగా యాడ్లు వేసి మరీ ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Bramhastra
నిర్మాత కరణ్ జోహార్ దీని మీద బాహుబలిని మించిన అంచనాలతో భారీ పెట్టుబడి పెట్టారు. ఇటీవలే లైగర్ దెబ్బ కొట్టడంతో ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. అసలే హిందీ సినిమా దారుణమైన స్లంప్ లో ఉంది. యష్ రాజ్ లాంటి సుప్రసిద్ధ బ్యానర్ బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్లు రుచి చూడాల్సి వచ్చింది. బయ్యర్లు కోల్పోయిన మొత్తం రెండు వందల కోట్ల పైమాటే. 2022లో ఇప్పటిదాకా లాభాలు ఇచ్చిన స్ట్రెయిట్ హిందీ మూవీస్ నాలుగే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళిని సమర్పకుడిగా ఒప్పించడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్లు షురూ చేశారు. మొన్న రన్బీర్ నాగ్ లతో ప్రత్యేకంగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
Brahmastram is your Bollywood weight
ఏ మాత్రం దీని ఫలితం అటుఇటు అయినా అంతే సంగతులు. ట్రైలర్ వచ్చాక అందులో విజువల్స్ మీద మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. మరి కంటెంట్ ఎలా ఉందో చూశాకే క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా సీక్వెల్స్ పరంగా వర్కౌట్ అయిన సినిమాలు బాహుబలి, కెజిఎఫ్, కార్తికేయలు. మరి ఆ సెంటిమెంట్ ని ఈ బ్రహ్మాస్త్ర కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి. సుమారు మూడు వందల కోట్ల దాకా వరల్డ్ వైడ్ బిజినెస్ చేయొచ్చని అంటున్నారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా అందులో మార్పు ఉండే అవకాశాలు లేకపోలేదు. మరో ఇంత బరువు మోస్తున్న బ్రహ్మస్త్రం గురి బాక్సాఫీస్ మీద సరిగ్గా కుదరాలి. ఏ కొంచెం తప్పినా గోవిందానే