iDreamPost
android-app
ios-app

‘బంగారు’ ‘ఘరానా’ బుల్లోళ్ళ మధ్య భామ – Nostalgia

  • Published Apr 24, 2020 | 1:18 PM Updated Updated Apr 24, 2020 | 1:18 PM
  • Published Apr 24, 2020 | 1:18 PMUpdated Apr 24, 2020 | 1:18 PM
‘బంగారు’ ‘ఘరానా’ బుల్లోళ్ళ మధ్య భామ – Nostalgia

ఒకప్పుడు టాలీవుడ్ మార్కెట్ లో మాస్ హీరోలుగా ఇద్దరు ఎవర్ గ్రీన్ స్టార్లకు వారసులుగా నిలిచిన అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ఆ టైంలో వీళ్ళు చేసిన బ్లాక్ బస్టర్స్ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆనందంతో చూస్తూ ఉంటారు. అందులో రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1993లో బాలయ్య హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి యాక్షన్ డ్రామాని మిక్స్ చేసిన తీరుకి ఘనమైన వసూళ్లు దక్కాయి.

ఇక్కడ చూస్తున్న పిక్ దాని ఓపెనింగ్ సందర్భంగా తీసింది. నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఇక్కడి ఫొటోలో ఉన్న రవీనాటాండన్ మెయిన్ హీరోయినా కాగా మరో ముద్దుగుమ్ముగా రమ్యకృష్ణ కూడా అల్లరి చేసింది. రాజ్ కోటి పాటలు కూడా సూపర్ సక్సెస్ కొట్టాయి. దీంతోనే రవీనా తెలుగు ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో 1995లో నాగ్ ఘరానా బుల్లోడు వచ్చింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా కమర్షియల్ గా భారీ హిట్టు. కీరవాణి ఇచ్చిన సంగీతం కూడా పెద్ద ప్లస్ అయ్యింది. ఇందులో కూడా రమ్యకృష్ణ హీరోయిన్ కానీ రవీనా లేదు.

అందుకే ఇక్కడ ఇద్దరు బుల్లోళ్ళ మధ్య భామ అనాల్సి వచ్చింది. అప్పటికి కుదరకపోయినా నాగార్జున రవీనాల కాంబినేషన్ 2001లో ఆకాశ వీధిలో ద్వారా కుదిరింది. ఉషా కిరణ్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. భారీగా నిర్మించినా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ కాంబోలు రిపీట్ కాలేదు. రవీనాటాండన్ బాలకృష్ణ, నాగ్ లతో చెరొక సినిమా మాత్రమే చేయడం గమనార్హం. అందుకే ఈ ఫోటో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet