iDreamPost
android-app
ios-app

బ్లాక్ బస్టర్ ఫార్ములాతో ప్రభాస్ 20

  • Published Apr 01, 2020 | 10:00 AM Updated Updated Apr 01, 2020 | 10:00 AM
  • Published Apr 01, 2020 | 10:00 AMUpdated Apr 01, 2020 | 10:00 AM
బ్లాక్ బస్టర్ ఫార్ములాతో ప్రభాస్ 20

తెలుగు సినిమా చరిత్రలో పునర్జన్మల ఫార్ములా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అక్కినేని నాగేశ్వర్ రావు మూగమనసులు మొదలుకుని రామ్ చరణ్ మగధీర దాకా ఈ లైన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. నాగార్జున సైతం జానకిరాముడుతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ 20 కూడా ఇదే ఫార్ములాతో రూపొందుతోందని తాజా అప్ డేట్. గోపీచంద్ జిల్ తో పరిచయమైన దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీకి ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల కనిపిస్తాడట. ఒకటి వయసు మళ్ళిన వాడిగా మరొకటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్ లో ఉంటుందట. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సాగుతుందా లేక జన్మ మారాక ప్రభాస్ ఇంకో ప్రేమ కథ మొదలుపెడతాడా లాంటి విషయాల గురించి క్లారిటీ లేదు. ఇదంతా లీకవుతున్న ఇన్ఫర్మేషన్ ను బట్టి వస్తోంది కాబట్టి ఖరారుగా ఏదీ చెప్పలేం. నిజానికి కరోనా గోల లేకపోయి ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసి ఉండేది. కానీ వైరస్ ప్రభావం వల్ల జార్జియా నుంచి త్వరగానే షూటింగ్ ముగించేసుకుని వచ్చిన టీమ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉంది.

ఇదంతా సద్దుమణగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అనుకున్నట్టు ఈ ఏడాదే ప్రభాస్ 20 విడుదలవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పూజా హెగ్డే ఈ సినిమా గురించి తెగఊరిస్తోంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వస్తోందని విజువల్ ట్రీట్ ఖాయమని చెబుతోంది. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత బ్యానర్ గోపికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని తర్వాత ప్రభాస్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి సంస్థలో భారీ ఫాంటసీ మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి పుణ్యమాని ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్ లో చేయాల్సి వస్తున్న ప్రభాస్ ను ఇకపై మిర్చి లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ లో చూడటం అంతే ఈజీగా కనిపించడం లేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş