iDreamPost
iDreamPost
గత వారం విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన భీష్మ ఊహించినట్టే నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మారింది. మొదటి వీకెండ్ కే పెట్టుబడిని ఇచ్చేసిన భీష్మతో ఇప్పుడొచ్చేవన్నీ లాభాలే. ఫస్ట్ వీకెండ్ కి 23 కోట్ల 51 లక్షల షేర్ రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గానే రన్ అవుతోంది. నైజామ్ లో అత్యధికంగా 7 కోట్ల 50 లక్షల షేర్ తో మీడియం రేంజ్ హీరోల్లో నితిన్ కొత్త మార్క్ ని సెట్ చేశాడు. ఎంత లేదన్నా ఇంకో రెండు వారాలు ఈజీగా ఈ రన్ కొనసాగుతుంది కాబట్టి 35 కోట్లకు పైగా ఫైనల్ రన్ కు క్లోజ్ అవ్వొచ్చని ట్రేడ్ అంచనా. దీన్ని మించినా ఆశ్చర్యం లేదు.
క్లాస్ సినిమాలకు కాస్త తక్కువగా వచ్చే సీడెడ్ లోనూ 3 కోట్ల చేరువలోకి వెళ్లడం విశేషమే. వీక్ డేస్ లో డ్రాప్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా బాగున్నాయి అనే తరహాలోనే కలెక్షన్స్ ఉన్నాయి. అల వైకుంఠపురములో తర్వాత 2020 ప్రారంభంలో రెండో బ్లాక్ బస్టర్ గా భీష్మ నమోదు కావడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వెంకీ కుడుముల టేకింగ్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ని డీల్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అందులోనూ వాటే బ్యూటీ లాంటి పాటలు మాస్ కి కనెక్ట్ కావడంతో ఇవన్నీ సానుకూలాంశాలుగా మారాయి.
ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా చూసుకుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి భీష్మ రూపంలో ఋజువయ్యింది. ఈ వారం హిట్, కనులు కనులను దోచాయంటే రిలీజయ్యాయి కానీ అవి డిఫరెంట్ జానర్స్ కావడంతో భీష్మకు వచ్చిన ఇబ్బందేమి లేదు. అందులోనూ ఇంకో రెండు వారాల దాకా తెలుగులో నోటెడ్ రిలీజులు ఏవి లేవు. దీంతో భీష్మ ఎంత రాబట్టుకుంటే అంత అనే తరహాలో పండగ చేసుకోవడం ఖాయం. ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏరియాల వారీగా మొదటి వారం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :
ఏరియా | షేర్ |
నైజాం | 7.50cr |
సీడెడ్ | 2.85cr |
ఉత్తరాంధ్ర | 2.55cr |
గుంటూరు | 1.54cr |
క్రిష్ణ | 1.32cr |
ఈస్ట్ గోదావరి | 1.43cr |
వెస్ట్ గోదావరి | 1.17cr |
నెల్లూరు | 0.60cr |
ఆంధ్ర+తెలంగాణా | 19.96cr |
కర్ణాటక + ROI | 1.75cr |
ఓవర్సీస్ | 2.80cr |
ప్రపంచవ్యాప్తంగా | 23.51cr |