iDreamPost
android-app
ios-app

అదరగొట్టిన భీష్ముడు – మొదటి రోజు కలెక్షన్స్

  • Published Feb 22, 2020 | 4:19 AM Updated Updated Feb 22, 2020 | 4:19 AM
అదరగొట్టిన భీష్ముడు – మొదటి రోజు కలెక్షన్స్

ప్రీ రిలీజ్ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ మోస్తూ వచ్చిన నితిన్ భీష్మ దానికి తగ్గట్టే మొదటి రోజు మంచి ఫిగర్స్ నమోదు చేశాడు. శుక్రవారంతో పాటు శివరాత్రి సెలవు కావడంతో చాలా చోట్ల హీరోకు సాధారణంగా వచ్చే రెగ్యులర్ ఓపెనింగ్స్ కన్నా మెరుగైన వసూళ్లు దక్కాయి. దానికి తోడు టాక్, రివ్యూస్ దాదాపు అన్ని బాగుందనే మెసేజ్ ఇవ్వడంతో వీకెండ్ పూర్తిగా భీష్మ కంట్రోల్ లోకి వెళ్లనుంది. గత ఐదు వారాలుగా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు భీష్మ ఎనర్జీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భీష్మ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 33 లక్షల షేర్ తెచ్చి నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ని నమోదు చేసింది. ఏపీ, తెలంగాణకు కలిపి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 18 కోట్ల 75 లక్షల దాకా ఉండగా అందులో 35 శాతం మొదటి రోజే రావడం విశేషం. నైజాం నుంచి అత్యధికంగా 2 కోట్ల 25 లక్షల వసూళ్లు వచ్చాయి. 

ఛలో తరహాలో ఇందులోనూ మంచి ఎంటర్ టైన్మెంట్ చూపించిన దర్శకుడు వెంకీ కుడుముల దాంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కు సంబంధించిన మెసేజ్ కూడా మిక్స్ చేయడంతో ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. ఓ పది రోజుల పాటు ఇదే రన్ ని స్టడీగా కొనసాగిస్తే సంక్రాంతి సినిమాల తర్వాత లాభాలు ఇచ్చిన మూవీ భీష్మనే అవుతుంది. రష్మిక మందన్న పాత్ర, పాటలు, వెన్నెల కిషోర్ రఘుబాబుల కామెడీ ట్రాక్ ఇవన్నీ భీష్మ టాక్ కు బాగా దోహద పడుతున్నాయి. మూడు డిజాస్టర్ల తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని వచ్చిన నితిన్ ఆ నిరీక్షణకు తగ్గ ఫలితాన్ని భీష్మ రూపంలో అందుకున్నట్టే కనిపిస్తోంది. ఏరియాల వారిగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

AREA SHARE
నైజాం  2.25cr
సీడెడ్   0.8cr
ఉత్తరాంధ్ర  0.62cr
గుంటూరు   0.76cr
క్రిష్ణ   0.4cr
ఈస్ట్ గోదావరి  0.67cr
వెస్ట్ గోదావరి  0.56cr
నెల్లూరు   0.26cr
Total Ap/Tg  6.33cr