iDreamPost
android-app
ios-app

Manchu Vishnu : మనం రాళ్లేసినా, వాళ్ళు రాళ్లేసినా మనకే నష్టం.. ఆచి తూచి మాట్లాడదాం!

Manchu Vishnu : మనం రాళ్లేసినా, వాళ్ళు రాళ్లేసినా మనకే నష్టం.. ఆచి తూచి మాట్లాడదాం!

సినీ నటీనటులు అలాగే సినీ పరిశ్రమకు చెందిన వారి జీవితాలన్నీ అద్దాలమేడ లాంటివి అని జనం పోలుస్తూ ఉంటారు. అందుకే సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.. కానీ ఒక్కోసారి మాత్రం అంచనాలను తప్పుతూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం మీద తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకురావాలని తెలుగు సినీ పరిశ్రమ కోరడంతో అందుకు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమేరకు చట్ట సవరణ కూడా చేసింది. అయితే అందులో పేర్కొన్న రేట్లు మరీ తక్కువగా ఉన్నాయని చెప్పడంతో ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని ఈ వ్యవహారాలు చూసుకుంటున్న మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి జగన్ ను, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ కొందరు విజ్ఞప్తులు చేశారు. అయితే హీరో సిద్ధార్థ్ మాత్రం మా మీద ఎందుకు పెత్తనం అన్నట్లు ట్వీట్లు చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలను తప్పు పట్టాల్సిన అవసరం అయితే పెద్దగా లేదు.

సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అని ప్రకటించుకుని దానికి తగ్గ టాక్స్ లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. అయితే అవన్నీ ఆలోచించకుండా కేవలం ప్రభుత్వాలను తప్పుబడుతూ మాట్లాడితే ఇబ్బందులు తప్పవు అని తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంచు విష్ణు ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులక ధన్యవాదాలు చెప్పిన ఆయన మంచి పాలసీలతో సినీ ఇండస్ట్రీని కాపాడుతున్నారని చెబుతూనే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరిపైనా రాళ్లు విసరకూడదు, అని అలాగే మా మేము మాట్లాడే మాటలు విని ఇతరులు కూడా మా మీద రాళ్లువిసిర పరిస్థితి తెచ్చుకోకూడదు అని అన్నారు.

ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఎవరైనా మాట్లాడితే అది ఇండస్ట్రీ పరంగా మాట్లాడినట్లు అవుతుంది కానీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు అవ్వదు కాబట్టి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించాలని అన్నారు. ఇది ఎవరినీ ఉద్దేశించి మాట్లాడకపోయినా ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ప్రభుత్వాలు చేస్తున్న విషయం మీద ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి తప్ప ఇండస్ట్రీ తరపు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడితే ఇండస్ట్రీ మొత్తం మీద ఒక ముద్ర పడే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వం ఏమీ టికెట్ రేట్లు పెంచేది లేదు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ విషయంలో ఇండస్ట్రీకి సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

Also Read : Bob Biswas : బాబ్ బిస్వాస్ రిపోర్ట్