iDreamPost
android-app
ios-app

దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

  • Published Jun 01, 2022 | 7:56 PM Updated Updated Jun 01, 2022 | 7:56 PM
దాదా ట్వీట్ వైరల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగూలీ??

మన దేశానికి క్రికెట్ లో ధోని, కోహ్లీ కంటే ముందు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ఘనత గంగూలీదే. టీమిండియాకి ఎన్నో సేవలు అందించిన గంగూలీ ప్రస్తుతం BCCI ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ కి తన వంతు సేవలు అందిస్తున్నారు. అయితే గంగూలీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో గంగూలీ రాజకీయాల్లోకి రానున్నారా అనే సందేహం మరింత బలపడింది.

గంగూలీ తాను చేసిన ట్వీట్ లో.. 2022 సంవత్సరంతో నా క్రికెట్‌ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో క్రికెట్‌లో నా జర్నీ స్టార్ట్‌ అయింది. ఈ 30 ఏళ్లలో నాకు క్రికెట్‌ ఎంతో ఇచ్చింది. నేను క్రికెట్‌కు ఎంతో సేవ చేశాను. క్రికెట్‌ను ప్రేమించిన ప్రతీ వ్యక్తి నాకు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకాలం నాకు సపోర్ట్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడదామనుకుంటున్నాను. ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నాకు ఎప్పటిలాగే మద్దతు ఉంటుందని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు.

గత కొన్ని రోజులుగా గంగూలీ బీజేపీలో జాయిన్ అవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకి ఈ ట్వీట్ మరింత దోహదమయింది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో గంగూలీ రెండు సార్లు భేటీ అయ్యాడు. పొలిటికల్‌ ఎంట్రీ కోసం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి కూడా గంగూలీ తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్ లో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీకి మరింత సపోర్ట్ కావడం కోసం గంగూలీ లాంటి వ్యక్తులు అవసరమని బీజేపీ భావించింది. గంగూలీని బెంగాల్ నుంచి బీజేపీ రాజకీయ ప్రతినిధిగా మారుస్తారని అంతా ఊహిస్తున్నారు. మరి గంగూలీ ఈ ట్వీట్ కి అర్ధం ఏమని పెట్టాడో కానీ జనాలు మాత్రం దాదా పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు. మరి దాదా ఏ ప్రకటన చేయనున్నాడో తెలియాలి అంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.