Published Jan 23, 2020 | 4:26 PM ⚊
Updated Jan 23, 2020 | 4:26 PM
|
Follow Us
సినిమా వార్తలు
అల వైకుంఠపురములో అందరికి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ క్లైమాక్స్ లో వచ్చిన సిత్తరాల సిరపడు పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఈ గీతాన్ని రాసిన బల్లా విజయ్ కుమార్ గురించి మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారమయ్యింది. ఈ నేపథ్యంలో ఇతని గురించి పాట గురించి మరిన్ని విశేషాలు బయటికి వస్తున్నాయి. ఆయన మాటల సారాంశంలోనే ఇవన్నీ తెలియడం విశేషం.
శ్రీకాకుళం ప్రాంతంలో సిరపడు అంటే అల్లరి ప్లస్ పెంకితనం ఉన్న పిల్లడు లేదా కుర్రాడు. అక్కడ ఈ పదాన్ని విశ్వబ్రాహ్మణులు కూడా వాడుతుంటారు. తమ వద్దకు వచ్చే వినియోగదారులను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి కోడ్స్ రూపంలో సిరపడు లాంటి పదాలను ఉపయోగించుకుంటారట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సిరపడు అంటే బలం లేకపోయినా చురుకుగా ఉంటూ పెత్తనాలు చేసి తన ఆధిపత్యాన్ని చూపించాలని ప్రయత్నించేవాడన్న మాట.
ఇప్పుడీ సిరపడు పాట ద్వారా ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్న విజయ్ కుమార్ బాగా పాపులర్ అయ్యారు.
విడుదలకు ముందు మ్యూజికల్ నైట్ జరిపినప్పుడు తాను హైదరాబాద్ వచ్చానని అయితే తన ప్రస్తావన లేకపోవడంతో సినిమాలో పాట తీసేశారనుకుని మౌనంగా ఉన్నానని చెప్పాడు. కానీ తర్వాత త్రివిక్రమ్ ఇంటికి పిలిపించి మరీ రెండు గంటల సేపు మాట్లాడి అభినందించడం మర్చిపోలేనని తన అనుభూతిని పంచుకున్నాడు. కేవలం రిలీజ్ కు ముందు ఈ పాట గురించి ఎలాంటి వివరం బయటికి రాకుండా యూనిట్ జాగ్రత్త పడిందని ఇప్పుడు అదే పెద్ద ప్లస్ అయ్యిందని అంటున్నారు. ఇప్పటికే మిలియన్ల వ్యూస్ వర్షంలో తడుస్తున్న సిరపడు పాట వీడియో వచ్చాక ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో