అవసరానికి విద్యార్ధులు కావాలా చంద్రబాబు?

చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే మాట నాకు 40 ఏళ్ల అనుభవం అని , కానీ నిజానికి చంద్రబాబు ఆలోచనా తీరు ఇంకా 40ఏళ్ళ వెనకపడి ఉంది అని తాను ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అర్ధం అవుతుంది. ఇంకా తాను చెప్పే మాటలకు ప్రజలు ముఖ్యంగా విద్యార్ధులు యువత నమ్మి తన వెంట నడుస్తారేమో అనే భావనలో ఉన్నారు. విద్యార్ధులని రాజకీయనాయకులు తమకి అనుకూలంగా మలుచుకుని వాడుకునే రోజులు పోయి, విద్యార్ధులు, యువతలో స్వీయ ఆలోచనా శక్తి పెరింగిందనే సంగతి ఇంకా చంద్రబాబు గ్రహించినట్టు లేదు. అందుకే తాను గతంలో విద్యార్ధుల పట్ల ప్రవర్తించిన తీరుని మరిచి మళ్ళీ తన ఉద్యమానికి విద్యార్ధుల అండ కోరుతున్నారు.

ఇన్సైడర్ ట్రెడింగ్ పద్దతిలో రాజధాని గా చెప్పబడిన అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నేతల ఆద్వర్యంలో భారీ భూ కుంబకోణం జరిగిందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, రాజధాని ఒకటే ఉండాలి, అభివౄద్ది అంతా ఒకే చోట జరగాలి అనే వాదాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్న తెలుగుదేశం నినాదం వెనక ఆ భూముల విలువ దాగున్నదని అనుమానాలు లేకపోలేదు. ఇటువంటి సమయంలో ఆ రాజధాని ప్రాంతమైన అమరావతిని విద్యార్ధులందరూ తమ భవిస్యత్తు కోసం ఉద్యమించి కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. నిజానికి ఆంద్రుల రాజధాని విద్యార్ధులకు ఎంతో ముఖ్యమైనది. తమ ఉన్నతమైన భవిష్యత్తు కు ఒక దిక్స్సుచి అయిన రాజధాని విషయంలో వారి నుంచి చంద్రబాబు ఆశించిన స్పందన రాకపోవడానికి గతంలో తెలుగుదేశం విద్యార్దుల పట్ల ప్రవర్తించిన తీరే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో నిరంకుశ పాలకుల అణిచివేతను విద్యార్థులు పోరాడి ప్రతిఘటించి నిలిచిన చరిత్ర ఉంది. కానీ రాను రాను విధ్యార్ధులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని వాడుకోవటం మొదలుపెట్టారు. గ్రూపులు కట్టించి విద్యాలయాలను రావణకాష్టంగా మార్చేశారు. ఇందులో చంద్రబాబుది ముఖ్యపాత్ర. తెలుగుదేశం అనుబంధ విభాగమైన తెలుగునాడుని 1999 ఎన్నికల్లో గెలుపు తరువాత రద్దు చేశారు. తిరిగి 2004లో ఎన్నికల్లో ఓటమి తరువాత పునరుద్ధరించారు . దానినే ఇప్పుడు లోకేష్ కి అప్పచెప్పారు. తెలుగునాడు వచ్చాక కాలేజీలలో విద్యార్ధులు కులాల వారిగా విడిపోయారు. “C”.., నాన్ “C” అనే గ్రూపులు ఏర్పడ్డాయి. తెలుగు నాడు విషయం లో చంద్రబాబు వ్యవహరించిన తీరు విద్యార్దులు కానీ విద్యార్ధి విభాగాలు కానీ చంద్రబాబుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తుకు వస్తాయి అని చెప్పటానికి ఒక నిదర్శనం. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్ళలో తమ పట్ల ప్రవర్తించిన తీరును ఇప్పటికి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రత్యేక హోదా మీద అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సభలు పెడితే విద్యార్ధులని వెళ్ళకుండా కట్టడి చేశారు. సభలకు వెళినవారిపై పొలీసు కేసులు పెట్టి జైలుకు పంపుతామని బహిరంగంగా విద్యార్ధులను, వారి తల్లి తండ్రులను బెదిరించారు, నాగార్జున విశ్వ విద్యాలయంలో రిషితేశ్వరి అనే విద్యార్ధిని లైంగిక వేదింపులకు గురి చెసి ఆమ చావుకు కారణమైన విద్యార్ధులు, వారికి అండగా ఉన్న ప్రిన్సిపల్ బాబు రావుపై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్ధిలోకం గళం ఎత్తితే చంద్రబాబు విశ్వ విద్యాలయల్లొ కుల సంఘాలను ముట్టుకోకుండా, విద్యార్ధి సంఘాలను మాత్రం రద్దు చేశారు. విద్యార్ధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిరసన కార్యక్రంలో పాల్గొన్న వారిని కాలేజీ నుండి సస్పెండ్ చెస్తాం అని చంద్రబాబు బందువు కాలేజి గీతం యునివర్సిటిలో నేరుగా విద్యార్ధుల ఫోనులకి మేసేజులు పంపి వారి హక్కులను వారి భవిష్యత్తుతో ముడి పెట్టారు.

ప్రత్యక హోదా కోసం విశాఖలో విద్యార్ధులు సోషల్ మీడియా ద్వారా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే పొలీస్ బలం తో అణిచివేశారు. వారికి మద్దతుగా వెళ్ళిన అప్పటి ప్రతిపక్షనేత జగన్ ని విమానాశ్రమంలొనే అడ్డుకున్నారు. 30 వేలమంది అగ్రికల్చరల్ విద్యార్ధులు రోడ్డున పడే విదంగా జి.ఒ నెంబర్ 64ని రద్దు చేశారు. ఏ.పి.పి.ఎస్.సి పరీక్షలు నిర్వహించే హక్కు ఒక ప్రయివేటు ఏజెన్సికి అప్పచెప్పి రాష్ట్రవ్యప్తంగా 172 సెంటర్లలొ మాస్ కాపియింగ్ కు ఆస్కారం కల్పించారు. ఇదేమి అన్యాయం అని అడిన విద్యార్ధులని పొలీసుల చేత కొట్టించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ సంస్థల్లో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం విచారణ జరిపించలేదు.

విశాఖలోని గిరిజన హాస్టల్ విద్యార్దినిలు వారికి ప్రభుత్వం అందించే మౌళిక సదుపాయాల్లో నాణ్యత కొరవడటం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే.. ఆడపిల్లలని కూడా చూడకుండా పొలీసుల చేత అత్యంత పాశవికంగా దాడి చేయించారు. 2014 ఎన్నికల్లో విద్యార్ధులకు ఇంటికోక ఉద్యొగం లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎత్తకుండా దారుణంగా మోసం చేశారు. ఇలా అడుగడుగునా విద్యార్ధులను మోసం చేసి, వారి హక్కులు కాలరాసిన చంద్రబాబు తీరా ఆయనకు, అయన బినామీల భూముల కోసం అమరావతి రాజధాని పై పోరాడాలంటూ విద్యార్థులకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది.

తమకు అన్యాయం జరుగుతున్నది అంటే పొరాటాంలో ముందు ఉండే నైజం విద్యార్ధులది. భారత్ దేశ చరిత్రలలో స్వతంత్ర ఉద్యమ దగ్గర నుంచి, హింది వ్యతిరేక ఉద్యమం , జై ప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బీహార్ ఉద్యమం, ఇందిరా గాందీ ఎమర్జన్సీ, అక్రమ వలస దారులకు వ్యతిరేకంగా అస్సాం విద్యార్ధులు నడిపిన ఉద్యమం , ఆంద్రాలో విశాఖ ఉక్కు ఉద్యమం, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అన్నీ విద్యార్దులు తమ బుజాలు మీద మొసినవే. కానీ నేడు చంద్రబాబు ఎంత చెప్పినా విద్యార్ధుల నుండి ఎలాంటి స్పందన రాకపొవటానికి విద్యార్ధుల పట్ల గతంలో చంద్రబాబు అవలబించిన తీరే కారణం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా విద్యార్ధుల పట్ల చంద్రబాబు అవలంబిస్తున్న తీరుని గ్రహించారు. అందుకే చంద్రబాబుని పట్టించుకోవటంలేదు. అంతేకాదు మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నభావనలో విద్యార్థులున్నారు.

Show comments