iDreamPost
android-app
ios-app

విషాదం.. గుండెపోటుతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత!

  • Published May 27, 2024 | 10:16 AM Updated Updated May 27, 2024 | 10:16 AM

Yerneni Sita Devi Passed away: ఇటీవల సీనీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన తారలు, నేతలు కన్నుమూయడంతో అభిమానుల్తో తీవ్ర విషాదం నెలకొంటుంది.

Yerneni Sita Devi Passed away: ఇటీవల సీనీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన తారలు, నేతలు కన్నుమూయడంతో అభిమానుల్తో తీవ్ర విషాదం నెలకొంటుంది.

  • Published May 27, 2024 | 10:16 AMUpdated May 27, 2024 | 10:16 AM
విషాదం.. గుండెపోటుతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత!

ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ కీలక నేతలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు..అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రాజకీ నేతలు, సినీ తారలు లోకాన్ని వీడిపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలువురు కీలక రాజకీయ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం నెలకొంది.. మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి తుది‌శ్వాస విడిచారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లో ఆమె కన్నుమూశారు. సీతా దేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కైకలూరు మండలం కోడూరు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ముదినేపల్లి నుంచి ఆమె రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు ఆ నియోజకవర్గం ప్రజలు. ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు సీతాదేవి. ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టీవ్ గా ఉన్నప్పటికీ ఆమెకు పెద్గగా పేరు రాలేదు.  ఈ  క్రమంలోనే ఆమే కొంతకాలంగా రాజకీయాల్లొ చురుగ్గా పాల్గొనలేకపోయారు.

ఇక యెర్నేని సీతాదేవి కుటుంబం రాజకీయ నేపథ్యంలో కూడుకున్నదే. ఆమె భర్త నాగేందర్ అలియాస్ చిట్టిబాబు ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. గత ఏడాది ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నాగేందర్ సోదరుడు దివంగత యెర్నేని రాజరామచందర్ రెండు సార్లు కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణం వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.