iDreamPost
android-app
ios-app

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ ఆసీస్ మహిళలదే

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ ఆసీస్ మహిళలదే

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్‌ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్‌లో చేతులెత్తేశారు.

ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది.2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా 2018, 2020లలో కూడా ప్రపంచకప్‌లను తన ఖాతాలో వేసుకుంది.తొలుత బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియాకి భారీగా 184 పరుగులు సమర్పించుకున్న టీమిండియా ఉమెన్స్ జట్టు అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్ల వైఫల్యంతో 19.1ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలిపోయింది.