రాజధాని వికేంద్రీకరణ బిల్లు 30 రోజుల్లో పాస్ అయినట్లేనా ?ఆర్టికల్ 197 ఏం చెబుతోంది?

తెలుగుదేశం మండలి రభస నెలరోజులు సంబరానికేనా? సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు రెండవ సారి శాసన మండలిలో అడ్డుకోగలిగాం అని తెలుగుదేశం చెబుతుంది. కానీ రాజ్యంగ ప్రకారం వారు ఆ బిల్లుని కేవలం నెలరోజులు మాత్రమే అడ్డుకోగలిగినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంత్రాలు సమాంతరంగా అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుని తెలుగుదేశం మొదటినుండి వ్యతిరేకిస్తూ వస్తుంది. రాజధాని అమరావతిలోనే ఉంచాలని పట్టుపడుతోంది.

ఈ క్రమంలో గత శాసన మండలి సభలో అబివృద్ది వికేంద్రికరణ బిల్లుని చర్చకు రానియకుండా చైర్మన్ కి ఉన్న విచక్షణాదికారాలను ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపిచబోతునట్టు ప్రకటిoచింది. అయితే ఆ ప్రక్రియ ఇప్పటివరకు మొదలు కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా శాసన సభలో ఈ బిల్లుని రెండసారి ప్రవేశపెట్టి ఆమోదించి తిరిగి మండలిలో ప్రవేశ పెట్టడం తెలుగుదేశం మండలి సభ్యులు దానిని అడ్డుకోవడం చైర్మెన్ మండలిని నిరవదిక వాయిదా వేయడంతో ఆ బిల్లు రెండవసారి ఆగిపోయింది.

అయితే భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 197 అధికరణ ప్రకారం ద్రవ్య బిల్లు కాకుండా ఇక ఏ బిల్లు అయినా శాసన సభలో ఆమోదం పొంది మండలి లో రెండవ సారి ప్రవేశపెడితే ఆ బిల్లు మండలి తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన 30రోజుల్లో బిల్లు పాస్ అయినట్టే బావించాలని స్పష్టంగా ఉండటంతో తెలుగుదేశం నేతలు రభస కేవలం నెలరోజుల పాటు అడ్డుకోవడానికేనా అనే మాట వినిపిస్తుంది. అయితే ఈ బిల్లు వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి అసలు శాసన సభలో రెండవసారి ప్రవేశ పెట్టడానికి అధికార పార్టికి హక్కే లేదు అని తెలుగుదేశం వాదన. అసాదారణ ప్రక్రియ ద్వారా రోజుకోక మలుపు తిరుగుతున్న ఈ వికేంద్రికరణ బిల్లుపై ఏమి జరగబోతోందో వేచి చూడాలి.

Show comments