Uppula Naresh
Uppula Naresh
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం లోయలో పడి 8 మంది జవాన్లు మరణించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఇండియన్ ఆర్మీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదంగా మారింది. మీడియా కథనం ప్రకారం.. దక్షిణ లడఖ్‌లోని నియోమా జిల్లాలోని ఖేరిలో విధుల్లో భాగంగా శనివారం సాయంత్రం ఓ ఆర్మీ వాహనం బయలు దేరింది. అయితే ప్రమాదవశాత్తు వీరి వాహనం భారీ లోయలో పడింది. స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోయలో పడ్డ వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఈ ప్రమాదంలో అప్పటికే 8 మంది ఆర్మీ జవాన్లు మరణించినట్లుగా తెలుస్తోంది. ఇక గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆస్పత్రి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనతో ఇండియన్ ఆర్మీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Ladakh | Seven Indian Army soldiers lost their lives in an accident 7 km short of Kyari town when their vehicle fell in a gorge. Many others are injured in the incident. The troops were moving from Karu garrison to Kyari near Leh. Many troops have suffered injuries also in the… pic.twitter.com/lAABfH5Zav
— ANI (@ANI) August 19, 2023
ఇది కూడా చదవండి: చైనా సరిహద్దుల్లో రాహుల్ గాంధీ బైక్ రైడ్! ఫోటోలు వైరల్..