iDreamPost

చైనా సరిహద్దుల్లో రాహుల్ గాంధీ బైక్ రైడ్! ఫోటోలు వైరల్..

చైనా సరిహద్దుల్లో రాహుల్ గాంధీ బైక్ రైడ్! ఫోటోలు వైరల్..

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిత్యం ప్రజలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే ధృడనిశ్చయంతో రాహుల్ గాంధీ ఉన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర పేరిట దేశం మొత్తం పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన అనేక వర్గాలను కలుసుకుని.. వారితో మమేకమయ్యారు. ఇది రాహుల్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాక తరచూ సామాన్యులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటించారు. అంతేకాక చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు వరకు  రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేశారు.

రాహుల్ గాంధీ శనివారం లడఖ్ లో పర్యటించారు.  ఈ క్రమంలోనే చైనా సరిహద్దుల్లో ఉన్న  పాంగాంగ్ సరస్సుకు బైక్ ను నడుపుకుంటూ వెళ్లారు. మరికొన్ని రోజుల్లో లడఖ్ స్వయం ప్రతిపత్తి అభివృద్ధి మండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పాంగాంగ్ సరస్సుకు బయలు దేరే ముందు.. రాహుల్ మీడియాతో మాట్లాడారు.  “ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న చెప్పేవారు.

” అని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాక తాను పాంగాంగ్ సరస్సు వరకు బైక్ పై వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ట్విట్టర్ లో రాహుల్ ఫోటోలను షేర్ చేసింది.  శనివారం రాత్రి కూడా పాంగాంగ్ సరస్సు వద్దే  రాహుల్ బస చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ఆగష్టు 20న రాజీవ్ గాంధీ పుట్టిన రోజును కూడా అక్కడే చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి.  రెండు రోజుల పర్యటన కోసం గత గురువారం లడఖ్ వెళ్లిన రాహుల్ ..తన పర్యటను ఐదు రోజుల పాటు పొడిగించుకున్నారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత లడఖ్ లో రాహుల్ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి.  వచ్చే నెల10న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ,కార్గిల్ ప్రాంతంలోని కౌన్సిల్ కు ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ బైక్ నడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. రాహుల్ యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

ఇదీ చదవండి: మరోసారి పరువు పోగొట్టుకున్న బాబు! తీసి పారేసిన కేంద్రం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి