iDreamPost
iDreamPost
సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నా ఇంకా అనేక మంది హద్దులు దాటిపోతున్నారు. అర్థసత్యాల ఆధారంగా అందరినీ నమ్మించేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని అదుపు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ఫేక్ పోస్టులతో సమాజాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారిని చట్ట ప్రకారం పట్టుకుని శిక్షించింది. అయినా తీరు మారిన తెలుగుదేశం నేతలు కొందరు అడ్డగోలుగా సాగుతున్నారు. చివరకు తాజాగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కూడా నిబంధనలు అతిక్రమించేశారు.
అసలే పారిశ్రామిక ప్రమాదం పట్ల అంతా ఆందోళనగా ఉన్న సమయంలో మరిన్ని అబద్ధాల్లో ప్రజల్లో అపోహలు పెంచే ప్రయత్నం చేసిన పూంతోట రంగనాయకి అనే టీడీపీ క్యాంప్ కి చెందిన మహిళా కార్యకర్త వ్యవహారం బయటపడింది. ఆమె పోస్టింగ్స్ విషయంలో తప్పుడు ప్రచారం గుర్తించిన పోలీసులు అరెస్ట్ కి రంగం సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటుగా మల్లాది రఘునాథ్ అనే వ్యక్తిని కూడా ఏ2గా పేర్కొన్నారు. గుంటూరుకి చెందిన వారిపై కేసు నమోదయినట్టు సీఐడీ వెల్లడించింది.
ప్రాధమిక విచారణలో లభ్యమయిన ఆధారాలతో వారివురిపై సెక్షన్ 505, 153ఏ, 188, 120 బీ, రెడ్ విత్ 24ఐపీసీ సెక్షన్లతో పాటుగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రంగనాయకిని అదుపులోకి తీసుకున్న తరుణంలో ఈ వ్యవహారంలో మరిత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనేది వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు.