ఏరంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా అందుకు అనువైన వాతావరణం కలిగి ఉన్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకెళుతుందని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ కానూరులోని తన నివాసంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో అమెరికా సంయుక్త రాష్ట్రాల కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి మేటి నగరాల్లో ఒకటిగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా తమ ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు.
గతంలో హైద్రాబాద్ పర్యటనకి వచ్చినప్పుడు తాము మంత్రి కోరిక పై విశాఖపట్టణంలో కూడా పర్యటించి వచ్చినట్టు అమెరికా ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా తాము ప్రభుత్వం తరుపున వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని యుఎస్ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో విశాఖపట్టణంలో ఒక సెమినార్ ఏర్పాటు చెయ్యవలసిందిగా మంత్రి యుఎస్ ప్రతినిధులను కోరగా దానికి యుఎస్ ప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, కమర్షియల్ ఎఫ్ఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్, కమర్షియల్ అధికారి ఇమ్మెన్యుయెల్, పొలిటికల్ అండ్ ఎకానమిక్ స్పెషలిస్ట్ సీబా ప్రసాద త్రిపాఠీ తదితరులు మంత్రిని కలిసిన అమెరికా ప్రతినిధుల బృందంలో ఉన్నారు