iDreamPost
android-app
ios-app

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ వెల్లువ

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ వెల్లువ

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, పథకాల అమలులో ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసింది. పథకాలు, కార్యక్రమాలపై పక్కాగా క్యాలెండర్‌ రూపొందించి మరీ వాటిని అమలు చేస్తోంది.

కోవిడ్ దెబ్బకి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గతేడాది లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇలాంటి సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఆగలేదు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలను ఆదుకున్న ఘనత సీఎం జగన్ కు దక్కనుంది. అధికారంలోకి వచ్చాక అనేక సాకులు చెప్పి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన నాయకులను చూశాము. కానీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసే తీరాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు సీఎం జగన్.

తాజాగా, జగనన్న విద్యాదీవెన పథకం లో భాగంగా మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి. బీసీ సంక్షేమ శాఖ రూ.491.42 కోట్లను జగనన్న విద్యాదీవెన మొదటి విడత కోసం విడుదల చేసింది. ఇందులో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు, ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది.

ఇవాళ… అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందజేశారు. 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

ఇలా చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళుతూ దేశంలోనే బెస్ట్ పరిపాలన ఏపీలో అందుతోంది. ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక అమలు చేస్తున్నారు.

Also Read : కరోనా సెకండ్ వేవ్ లో కూడా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వం