iDreamPost
android-app
ios-app

కోర్టు ధిక్కార అభియోగం.. వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్కార అభియోగం.. వైసీపీ నేతలకు హైకోర్టు  నోటీసులు

ఏపీ హైకోర్టు వైసీపీ నేతలు, కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసింది. హైకోర్టు, గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగంపై సుమోటోగా విచారణ జరిపింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డితో సహా 49 మంది ఇతరులు చేసిన పోస్టులపై విచారణ జరిపిన హైకోర్టు.. వారందిరికీ నోటీసులు జారీ చేసింది.

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై సోషల్‌ మీడియాలో పలు వ్యాఖ్యలు వినిపించాయి. అమరావతి భూ కుంభకోణం, కాల్‌మనీ రాకెట్, తహసీల్దార్‌ వనజాక్షి పై దాడి తదితర ఘటనలు జరిగినప్పుడు లేని సీబీఐ విచారణ.. చిన్న పెట్టి కేసు అయిన సుధాకర్‌ ఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించడం ఏమిటనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ అంశంపైనే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందని తెలుస్తోంది. అయితే ఇవే వ్యాఖ్యలు పలు ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానెళ్లులో జర్నలిస్టులు కూడా చేశారు. వారికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.