iDreamPost
android-app
ios-app

జెట్‌ స్పీడ్‌లో వైసీపీ సర్కార్‌..!

జెట్‌ స్పీడ్‌లో వైసీపీ సర్కార్‌..!

కరోనా మహమ్మరి పంజా విసురుతూ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్‌ ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులుపెట్టిస్తోంది. వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. పరిశ్రమలకు కూడా జగన్‌ సర్కార్‌ అదే అండను ఇస్తోంది. నిన్న పంట పెట్టుబడి కోసం దాదాపు 50 లక్షల రైతులకు నేరుగా వారి ఖాతాల్లో 2800 కోట్ల రూపాయలు జమ చేసిన వైసీపీ సర్కార్‌ తాజాగా రాష్ట్రంలో చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు కష్టకాలంలో ఆర్థిక ప్యాకేజీ తో అండనిచ్చింది.

ప్రస్తుత కష్ట కాలంలో పెండింగ్‌లో ఉన్న 904 కోట్ల రూపాయల రాయితీ సొమ్ములను రెండు దఫాలుగా విడుదల చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా మూడు నెలల ఫిక్సిడ్, డిమాండ్‌ విద్యుత్‌ చార్జీలు మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2 నుంచి 10 లక్షల రూపాయల రుణాలు కేవలం 6 నుంచి 8 శాతం వడ్దీతో ఇవ్వనుంది. ఇందు కోసం 200 కోట్ల రూపాయలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రకాల ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలు ఆదేశాలు జారీ చేసింది.