రాష్ట్రంలో ఇళ్లపట్టాల పంపిణి పై సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై జగన్ కలెక్టర్లతో చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ఈ ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణి ప్రక్రియ ను ప్రభుత్వం ఏప్రిల్ 14 కు వాయిదా వేసింది. ఈ మేరకు కరోనా వ్యాప్తి ని దృష్టిలో ఉంచుకుని వైరస్ వ్యాప్తి కి తీసుకుంటున్న నివారణా చర్యల దృష్యా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 న నిర్వహించాలని అధికారులని ఆదేశించారు.
తొలుత ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది సొంత ఇంటి స్థలం లేని నిరుపేద లభ్డిదారులందరికి ఒకేసారి ఇళ్ల పట్టాలు చేతికి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో కోడ్ కారణంగా మొదట శ్రీరామనవమికి వాయిదా వెయ్యాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికలు వాయిదా పడడంతో ఎన్నికల కోడ్ అడ్డంకి తొలగినప్పటికీ, కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇళ్ల పట్టాలు పంపిణి కార్యక్రమం నిర్వహించడం సరి కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఇళ్ల పట్టాలు పంపిణి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 కు వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.