ఒకవైపు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయని, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారుతుందని ఇటీవలకాలంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు మీడియాలో ఒక వర్గం భారీగా ప్రచారం చేస్తున్న తరుణంలోనే ఇన్వెస్ట్ ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకోంది.
ఇన్వెస్ట్ ఇండియా సంస్థ ప్రకారం దేశంలో పెట్టుబడవులకు అత్యంత అనువైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సంపాదించదానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుదారులకు అత్యంత అనుకూలంగా ఉన్న పారిశ్రామిక విధానమే కారణమని తెలుస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులకు 24 గంటలలోపే పాలనా పరమైన క్లియరెన్స్ ఇవ్వడం, రాష్ట్రలో రాజకీయ అవినీతి అత్యంత తక్కువగా ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
దీనితో పాటు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులకు అనువుగా వున్న సుస్థిరమైన రాజకీయ వాతావరణం, పెట్టుబడి దారులకు అందుబాటు ధరల్లో మౌలిక వసతుల లభ్యత , మానవ వనరుల లభ్యత, అనువైన పారిశ్రామిక వాతావరణం, నిరంతరాయంగా తక్కువ రేటుకే లభిస్తున్న నాణ్యమైన విధ్యుత్, ప్రభుత్వం నుండి లభిస్తున్న మెరుగైన ప్రోత్సాహకాలు, పన్ను రాయతీలు మొదలైన అనుకూల అంశాల వలన పెట్టుబడిదారులు ఆంద్ర ప్రదేశ్ లో తమ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. అంతేకాక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నౌకా శ్రయాలు, హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలకు మంచి రోడ్డు కనెక్టివిటీ కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ తమ కధనంలో వెల్లడించింది.
ఇటీవల కాలంలో పూర్తి స్థాయి సామర్ధ్యం తో పనిచేస్తున్న కియా కార్ల పరిశ్రమ అనంతపురం నుండి తరలి వెళుతుందేమోనంటూ సందేహం లేవనెత్తుతూ ఒక అంతర్జాతీయ దినపత్రిక ప్రచురించిన కధనాన్ని పట్టుకొని, ఆ పత్రికా కధనాన్ని కియా పరిశ్రమ యాజమాన్యమే ఆ కధనాన్ని స్వయంగా ఖండించినప్పటికీ.. దానిని పట్టించుకోకుండా పెట్టుబడులన్నీ రాష్ట్రం నుండి వెళ్ళిపోతున్నాయని ప్రతిపక్షాలు ప్రజలను నమ్మించడానికి కుట్ర పూరితంగా పెద్ద ఎత్తున అసత్య ప్రచారానికి దిగిన తరుణంలో ఇన్వెస్ట్ ఇండియా సంస్థ ఈరోజు ప్రకటించిన జాబితాలో దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంక్ కైవసం చేసుకోవడంతో విపక్షాల చేస్తున్న ప్రచారాలన్నీ ఒట్టి అభూతకల్పనలేనని, విపక్షాలు చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది.
గత చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చేసుకున విధ్యుత్ ఒప్పందాల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ ఒప్పందాలను పునర్ సమీక్షిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తమ అవినీతి మూలాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడిన తెలుగుదేశం పెద్దలే ఒక పధకం ప్రకారం రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీయడానికి, తద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చెయ్యడానికి తమ చేతిలో ఉన్న వార్తాఛానెళ్లను ఉపయోగించుకొని ప్రభత్వంపై అసత్య ప్రచారానికి తెగబడినట్టు అర్ధమౌతుంది