iDreamPost
iDreamPost
రాష్ట్రంలో వై.యస్ జగన్ ప్రభుత్వం బడాబాబులకు షాక్ ఇస్తూ విధ్యుత్ చార్జీల పెంపు నిర్ణయంతీసుకుంది. 500 యునిట్లు దాటిన వారికి అదనంగా యునిట్ కు 90పైసలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 500 యునిట్ల టారిఫ్ ఇప్పటివరకు 9రూపాయల 5పైసలు ఉండగా తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో 9రూపాయల 95పైసలు అయింది. అలాగే ప్రభుత్వం 500 యునిట్ల లోపు వాడే వినియొగదారులపై ఎటువంటి భారం ఉండదు అని ప్రకటించటంతో ఈ విధ్యుత్ చార్జీల పెంపు కేవలం బడా బాబులకూ మాత్రమే అని అర్ధం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బాడాబాబులతోపాటు కార్పొరేట్ సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, పరిశ్రమలు, కార్యాలయాలకు మాత్రమే ఈ బారం పడనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి 1300 కోట్లు ఆదాయం సమకూరనుంది.
ఇప్పటికే ఆంద్రప్రదేశ్ డిస్కంలు చాలావరకు తీవ్ర నష్టాల్లొ ఉండటంతో ఆ నష్టాలనుండి బయటపడేందుకు తప్పనసరి చార్జీల పంపు నిర్ణయం తీసుకున్నా, ఈ నిర్ణయం సామాన్యుడిపై బారం పడకుండా ఉండేందుకే 500 యునిట్లు కంటే అదనంగా వాడే వారిపై మాత్రమే ఈ బారం మోపటం విశేషం. దీంతో 500 యునిట్ల విద్యుత్ వాడకం ఉన్న 1.35 లక్షల వినియొగదారులపై ఈ బారం పడనుంది. అలాగే ఇక నుంచి సబ్సిడి దారులకు బిల్లు వెనుక సబ్సిడి వివరాలు పొందు పరచే నిర్ణయం తీసుకునట్టు, ఇంకా రైల్వే ట్రాక్షన్ టారిఫ్ పెంచడం వలన 200కోట్లు బారం పడుతునట్టు ఏ.పి ఈ.ఆర్.సి చైర్మన్ సి.వి నాగార్జున రెడ్డి తెలిపారు.