iDreamPost
iDreamPost
తల్లి తండ్రులు నిరక్ష్యరాస్యులు కావడం, అర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రస్నార్థకంగా మారుతోంది. జగన్ ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించే విధంగా అమ్మఒడి, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లాంటి పధకాలను ప్రవేశపెట్టినా తల్లితండ్రుల నిర్లక్ష్య దోరణి వలన అక్కడక్కడా బాలలు వెట్టి చాకీరి చేస్తూ కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్పాట్ వాల్యుఏషన్ గదిని తుడిచే పని చేసే వ్యక్తి తను చేయవలసిన ఆ పనిని తన 6ఏళ్ళ కూతురు చేత చేయంచడం దీనిని అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ సైతం అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయంశం అయింది.
దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర డిజీపి గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. భాద్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాలల హక్కుల చట్టం ప్రకారం 14ఏళ్ళు నిండని బాల బాలికల చేత ఇలా చాకిరీ చేయించడం నిషిద్దం అని, ఈ ఘటనకు పాల్పడినది తండ్రి అయినప్పటికి అతను చట్టపరంగా శిక్షార్హుడని అలాగే ఘటన జరుగుతున్న సమయంలో అడ్డుకోకుండా చోద్యం చూస్తు ఉండిపోయిన హెడ్ కానిస్టేబుల్ పై కూడా శాఖా పరమైన చర్యలు తప్పవని, ఇలాంటి ఘటనలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు పాలనలో పెరిగిపోయిన బాలకార్మికులు
గత ప్రభుత్వంలో సాంఘిక భద్రతా పథకాల లేమి, విద్యావిధానంపై తల్లిదండ్రులకు విశ్వాసలోపం వలన 2015-18 మద్యలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బాల కార్మికులు 3 రెట్లు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2015 లో రాష్ట్రంలో బాల కార్మికులు 13,294 మంది ఉంటే అది 2018 వచ్చేసరికి 46,744 మంది పెరిగి 60,038 మంది అయారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనoతగా ఇలా రాష్ట్రంలో బాల కార్మికులు పెరగడానికి తల్లి తండ్రుల నిర్లక్ష్య దోరణి సగం కారణం అయితే పిల్లల్ని బాల కార్మిక వ్యవస్థ నుండి దూరం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య దోరణితో వ్యవహరించడం మరొక కారణం. ఏకంగా చంద్రబాబే అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో నాడు బాల కార్మికులను వాడుకున్నారు అంటే ఆ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చు. బాబు గత 9ఏళ్ళ పాలన చూసుకున్న బాలకార్మిక వ్యవస్థలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అత్యధిక మంది బాల కార్మికులు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందడం గమనార్హం.
చంద్రబాబు పాలనలో కనీస అవకాశాల కొరత , చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించటంతో రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ తీవ్రంగా పెరిగిపోవడం గమనించిన జగన్ అధికారంలోకి రాగానే ఈ బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఒక పక్క అమ్మఒడి , నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలలో సైతం ఇంగ్లీషు మీడియం లాంటి పధకాలు చేపట్టడం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవులు నిర్వహిస్తు ఎక్కడికక్కడ బాలకార్మిక వ్యవస్థని కట్టడి చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా రాష్ట్ర పోలీస్ బాసే ఈ ఘటనపై స్పందించి తాము ఈ విషయంలో ఎంత చిత్తశుద్దితో ఉన్నామో నిరూపించారు. ఏది ఏమైన జగన్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి ఘటనపై రాష్ట్ర పోలీస్ బాస్ నేరు గా స్పందించి చర్యలు చేపట్టడం హర్షనీయం