iDreamPost
iDreamPost
వరదలతో అల్లల్లాడుతున్న వారందికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. అరిగెలవారి పేటలో బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. వారికి అందుతున్న సహాయం గురించి వాకబు చేశారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే, అధికారులందరూ నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం రోజుల సమయమిచ్చి, తర్వాతే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని బాధితులకు భరోసానిచ్చారు.
అక్కడున్న ప్రజల కోరిక మేరకు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే, వరద నష్టం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు.
వర్షంలోనూ సీఎం జగన్ ఆగకుండా తన పర్యటనను కొనసాగుతోంది. సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే బాధితులను అడిగితెలుసుకొంటున్నారు. కాలి నడకనే వెళ్తున్నారు.