iDreamPost
android-app
ios-app

చంద్ర మోహన్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్

టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఈ నెల 11న తుది శ్వాస విడిచారు. చంద్ర మోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఈ నెల 11న తుది శ్వాస విడిచారు. చంద్ర మోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

చంద్ర మోహన్  మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్

దిగ్గజ నటుడు చంద్రమోహన్ ఇక లేరన్న వార్త టాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తుతోంది. ఆయనతో పని చేసిన నటీనటులంతా చంద్రమోహన్ కన్నుమూశారని తెలిసి కన్నీటి పర్యంతమౌతున్నారు. ఆయన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆ నటుడి మృతి వార్త బయటకు రాగానే సినీ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన ప్రస్తుత వయస్సు 80 సంవత్సరాలు. 1966లో రంగుల రాట్నంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. 2017 వరకు అప్రతిహతంగా కొనసాగింది. పదా, వందా, 932 సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. కుటుంబ కథా చిత్రాల నటుడిగా, తెరపై మధ్యతరగతి మనిషిగా కనిపించి కనువిందు చేశారు ఈ విలక్షణ నటుడు.

చంద్రమోహన్ మరణం పట్ల సినీ పరిశ్రమే కాదూ.. యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ ఇక లేరన్న వార్త పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. ‘ ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్ర‌మోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ  సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.

కృష్ణా జిల్లాలోని పడిమిముక్కలలో జన్మించిన ఆయన.. తెలుగు పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించారు. ఎవ్వరినీ హర్ట్ చేయని వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన నటించిన పలు సినిమాలకు నంది అవార్డులను తీసుకున్నారు. హీరోగా నటిస్తూనే బడా హీరోలకు సోదరుడిగా, స్నేహితుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఇప్పటి వరకు ఆయన 932 చిత్రాల్లో నటించగా.. అందులో 175 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు. అటు పాత, ఇటు కొత్త తరంతో పని చేసిన నటుడాయన. ఆయన చివరి చిత్రం గోపిచంద్ నటించిన ఆక్సిజన్ మూవీ అని తెలుస్తోంది. ఓ తరం నటీనటులు వరుసగా కన్నుమూస్తుండటం చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తుతోంది.