Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ప్రధానంగా హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రభుత్వానికి మార్గదర్శంన చేసేలా నివేదిక రూపాందించింది.
మూడు రాజధానుల ఏర్పాటుతో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికకు కేబినెట్ ఆమోదించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఆర్‌డీఏ రద్దు, దాని స్థానంలో అమరావతి మెట్రో పాలిటన్ సిటీ ఏర్పాటుకు బిల్లు పెట్టనున్నట్లు సమాచారం. వీటితోపాటు అభివృద్ధి వికేంద్రీకణపై పలు బిల్లులను కేబినెట్ ఆమోదించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మరో అరగంటలో కేబినెట్ భేటీ ముగియనుంది. ఆ తర్వాత బీసీఏ సమావేశంలో అసెంబ్లీ సమావేశ అజెండా ఖరారు చేయనున్నారు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతోంది.