అసెంబ్లీ ఆరో రోజు సమావేశాలు

  • Published - 02:43 AM, Mon - 16 December 19
అసెంబ్లీ  ఆరో రోజు సమావేశాలు

– ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు

– ప్రభుత్వ మద్యం దుకాణాలకు అధిక అద్దెలు చెల్లింపు, రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పనిచేయకపోవ డంపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు

– తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపు, కాళీ పట్నం జమీందారు భూముల వివాదం, పుట్టపర్తిని ఒకే రెవిన్యూ డివిజన్ లో కలపడంపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు

– ఇవాళ 13 బిల్లులకు ఆమోదం తెలపనున్న శాసనసభ

– ఎస్సీ కమిషన్ బిల్లు, ఎస్టీ కమిషన్ బిల్లు, ఎక్సైజ్ చట్టంలో సవరణలకు సంబందించి రెండు బిల్లులు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ

– ఇవాళ శాసనసభలో నూతన మద్యం విధానంపై స్వల్పకాలిక చర్చ

– సీపీఎస్ విధానం రద్దు, తెలుగు విశ్వవిద్యాలయం విభజన, తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి శాసనమండలిలో ప్రతిపక్షాల ప్రశ్నలు

– రాష్ట్రంలో శాంతిభద్రతలు, అమరావతి నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చలు.

Show comments