ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక సమాచారం వచ్చింది. ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21న ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా, 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. అంతేకాక అసెంబ్లీ సమావేశానికి ముందు రోజు కీలక భేటీ జరుగనుంది. సెప్టెంబర్ 21న అసెంబ్లీ సమావేశాలు మొదలు కానుండగా సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినేట్ చర్చించనుంది. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు సెప్టెంబర్ 21న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశఆలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అప్పటి పరిస్థితిని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. ఇకఈ సమావేశాలు పలు బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లులే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. అంతేకాక మరికొన్ని కొత్త బిల్లులను కూడా సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో రాజకీయం వాడీవేడీగా ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సమాచారం రావడం అందరిలో ఆసక్తిని కలిగించింది. సమావేశాలు ఎలా జరుగుతాయి.. అసలు ఈ సమావేశాల్లో టీడీపీ పాల్గొంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.